మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..

By Bukka Sumabala  |  First Published Aug 24, 2022, 7:09 AM IST

హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఓ స్థల వివాదానికి సంబంధించిన వ్యవహారంలో ఈ కేసు నమోదయ్యింది. 


హైదరాబాద్ : టిఆర్ఎస్ నేత, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదయ్యింది. ఆయనతో పాటు మిరియాల తిరుపతిరెడ్డి అనే వ్యక్తిపై  ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు 120బీ, 384, 406, 420 తదితర సెక్షన్ల కింద ఘట్కేసర్ పోలీస్స్టేషన్లో ఈ నెల 20న కేసు నమోదైంది. ఓ భూమికి సంబంధించిన వ్యవహారంలో తనను మోసం చేశారంటూ బోడుప్పల్ కు చెందిన బొమ్మాకు మురళి (47) ఇటీవలఎల్బీనగర్లోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.  దీనిని విచారించిన కోర్టు ఇద్దరిపై కేసు నమోదు చేయాలంటూ ఘట్కేసర్ పోలీసులను ఆదేశించింది.

ఒప్పందం చేసుకుని మోసం…
ఎఫ్ఐఆర్లోని వివరాల ప్రకారం ఘట్కేసర్ మండలం జానంపేటలో సర్వే నెంబర్ 89 లోని 11 ఎకరాల 28 గుంటల భూమికి సంబంధించి మురళి అనే వ్యక్తి వివిధ అనుమతుల కోసం బొంతు రామ్మోహన్ సంప్రదించాడు. ఇద్దరి మధ్య ప్రాజెక్టులో 60:40 శాతం చొప్పున వాటాకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత రామ్మోహన్ సూచన మేరకు సదరు యజమానులకు నాలుగు కోట్ల రూపాయలు చెల్లించి పాసు పుస్తకాలు తీసుకున్నారు. చివరి రిజిస్ట్రేషన్కు మేడ్చల్ జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ లో ఆన్లైన్లో పెండింగ్లో ఉండగా.. రామ్మోహన్ తన పలుకుబడితో అడ్డుకున్నారు. 

Latest Videos

undefined

మ‌రోసారి తెర‌మీద‌కి వ‌చ్చిన చెన్నమనేని పౌర‌స‌ర్వ వివాదం.. నేడే విచార‌ణ‌

ఆ తర్వాత రామ్మోహన్ కు.. మిర్యాల తిరుపతి రెడ్డితో మంచి ఒప్పందం కుదిరింది. దీంతో మురళిని తప్పుకోవాలని సూచించారు. ఆ తర్వాత భూమిని తిరుపతిరెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. షరతులో భాగంగా మురళికి రావాల్సిన రూ.3 కోట్లకు సంబంధించి… అనేకసార్లు సంప్రదించినా వారు సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో  బొంతు రామ్మోహన్, తిరుపతి రెడ్డి ఉద్దేశం ఉద్దేశపూర్వకంగా మోసం చేశారు’ అని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. 

click me!