మ‌రోసారి తెర‌మీద‌కి వ‌చ్చిన చెన్నమనేని పౌర‌స‌ర్వ వివాదం.. నేడే విచార‌ణ‌

Published : Aug 24, 2022, 06:27 AM IST
మ‌రోసారి తెర‌మీద‌కి వ‌చ్చిన చెన్నమనేని పౌర‌స‌ర్వ వివాదం.. నేడే విచార‌ణ‌

సారాంశం

మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం. ఈ వివాదంపై దాఖాలైన పిటిష‌న్ ను ఇవాళ తెలంగాణ హైకోర్టు  విచారించ‌నున్న‌ది.  

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం మ‌రోసారి తెర‌మీద‌కు వ‌చ్చింది. ఈ వివాదంపై దాఖ‌లైన పిటిష‌న్ ను మంగ‌ళ‌వారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రయాణ స‌మ‌యాల్లో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ త‌న పాత పాస్‌పోర్టును ఉపయోగించినంత మాత్రాన... ఆయ‌న జ‌ర్మ‌నీ పౌరుడు కాలేరని,  జర్మనీ రాయబార కార్యాలయం  లిఖితపూర్వకంగా చెప్పిందని ఆయన తరఫు న్యాయవాది వై.రామారావు కోర్టుకు నివేదించారు. 2009లోనే  చెన్నమనేని నిబంధనలకు అనుగుణంగా  భారత పౌరసత్వం పొందారని,  ఈ విష‌యంలో రాజ‌కీయ ల‌బ్దీ పొంద‌డానికి, రాజ‌కీయ కుట్ర జ‌రుగుతోంద‌ని అన్నారు. రాజకీయ ప్రత్యర్థి కావాల‌నే ఈ కేసు వేశారని హైకోర్టుకు తెలిపారు.
  
2009లోనే చెన్నమనేని రమేశ్ భార‌త దేశ‌ పౌర‌స్వ‌తం పొందార‌నీ, ఆ తరువాత  నాలుగుసార్లు తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి..ఎమ్మెల్యేగా గెలిచారని తెలిపారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్యార్థి, కాంగ్రెస్ నాయ‌కులు ఆది శ్రీనివాస్ .. కావాల‌ని  చెన్నమనేని రమేశ్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారంటూ  హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గత కొంత‌కాలంగా ఈ కేసుఉ విచారణ జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్ర హోంశాఖ ఆయ‌న షాక్ ఇచ్చింది. ఆయన‌  పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

ఆయ‌న అంత‌టీతో కాకుండా.... కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్య‌తిరేకిస్తూ..హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు  చెన్నమనేని. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. చెన్నమనేని తరఫున వై.రామారావు వాదనలు వినిపిస్తూ..  30 రోజుల్లో అతని పౌరసత్వంపై వ‌చ్చిన   అభ్యంతరాలు తెలిపాలని నిబంధన ఉందన్నారు.

కానీ, హోంశాఖ ఈ నిబంధ‌న‌ను వ్య‌తిరేకించింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత(120 రోజుల) ప్రత్యర్థి అభ్యంతరం తెలుపడం.. దాన్ని స్వీకరించడం చట్టవిరుద్ధమ‌ని పేర్కొంది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా హోంశాఖ పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. భారత పౌరసత్వం తీసుకున్న నాటికి రమేశ్‌ రాజకీయాల్లో లేరని వెల్లడించారు. వాదనలు విన్న ధర్మాసనం.. విచారణ నేటీకి వాయిదా వేసింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?