నేరెళ్ల ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం

First Published Aug 21, 2017, 8:50 PM IST
Highlights
  • నేరెళ్ల ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్
  • ఫ్యాక్స్ లో నివేదిక పంపాలంటూ డిజిపి, సిఎస్ లకు ఆదేశం
  • ఇప్పటికే ఎస్సై సస్పెన్షన్, ఎస్సీ ని తప్పించిన సర్కారు
  •  

నేరెళ్లలో దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి శ్రీ రామచంద్ర కుంతియా కూడా జాతీయ sc కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

దీంతో నెరేళ్ల దళితులపై పోలీసుల తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్ రియాక్ట్ అయింది. వెంటనే సమగ్ర నివేదికను తయారు చేసి ఫాక్స్ ద్వారా పంపించాలని డీజీపీ, చీఫ్ సెక్రెటరీలను కమిషన్ ఆదేశించింది.

సిరిసిల్ల జిల్లా నెరేళ్లలో దళితులపైన అక్రమంగా కేసులు పెట్టి, అక్రమంగా నిర్బంధించి 5 రోజులపాటు 3rd డిగ్రీ ప్రయోగించి, తీవ్రంగా చిత్ర హింసలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఇప్పటికే తెలంగాణ సర్కారు ఒక ఎస్సైని సస్పెండ్ చేసింది. తాజాగా ఎస్పీని అక్కడి నుంచి తప్పించింది.

సాధ్యమైనంత త్వరగా నివేదిక అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులను ఎస్సీ కమిషన్ ఆదేశించింది. తెలంగాణ సిఎస్, డిజిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ఎస్సీ కమిషన్ ఉపక్రమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.           

click me!