‘‘రా చూసుకుందాం’’..గుండాగిరి, దాదాగిరి నాకు తెలుసు: ఉత్తమ్‌కు సర్వే హెచ్చరిక

sivanagaprasad kodati |  
Published : Jan 07, 2019, 01:04 PM IST
‘‘రా చూసుకుందాం’’..గుండాగిరి, దాదాగిరి నాకు తెలుసు: ఉత్తమ్‌కు సర్వే హెచ్చరిక

సారాంశం

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనపై క్రమశిక్షణాపరమైన చర్య తీసుకోవాలంటే హైకమాండ్‌కే అధికారం ఉందన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. తనపై క్రమశిక్షణాపరమైన చర్య తీసుకోవాలంటే హైకమాండ్‌కే అధికారం ఉందన్నారు.

సోనియా,రాహుల్ లేదంటే ఏకే ఆంటోనీకే తనపై చర్య తీసుకునే అధికారం ఉందని సర్వే తెలిపారు. కేవలం నిలదీసినందుకే తనను టార్గెట్ చేశారని, వారి వల్లే పార్టీ నష్టపోయిందని సత్యనారాయణ అన్నారు.

ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పార్టీ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తోందన్నారు. గాంధీ కుటుంబానికి తాను విధేయుడినని, తనకు రాజకీయ జన్మ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అని ఆమె కోసం చావడానికైనా సిద్ధమని సర్వే ప్రకటించారు.

ఎన్నికల్లో ఓడించేందుకు ఉత్తమ్ కుట్రలు చేశారని, ఎన్నికల ఖర్చు కోసం పార్టీ నిధులు విడుదలు చేసిందని, దానితో పాటు టీపీసీసీ సైతం డబ్బు వసూలు చేసిందని ఆయన తెలిపారు. తనకు మందీమార్బాలం ఉందని, రౌడీయిజం, దాదాగిరి తాను చేయగలనని సర్వే హెచ్చరించారు. 

ముఖ్యమంత్రిని అవుతాననే.. ఉత్తమ్ నన్ను ఓడించాడు: సర్వే
 
PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?