ముఖ్యమంత్రిని అవుతాననే.. ఉత్తమ్ నన్ను ఓడించాడు: సర్వే

By sivanagaprasad kodatiFirst Published Jan 7, 2019, 12:59 PM IST
Highlights

దళితబిడ్డనైన నేను గెలిస్తే..పార్టీ మెజార్టీ సాధిస్తే ముఖ్యమంత్రిని అవుతాననే భయంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి తనను ఓడించేందుకు కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నేతలకు ఫోన్ చేసి తనను ఓడించాలని ఆదేశాలిచ్చారని సర్వే విమర్శించారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీపరంగా ఎలాంటి పదవులు ఇచ్చినా, కార్యక్రమాలు జరిపినా ఏఐసీసీ నుంచి రాహుల్ గాంధీ అప్రూవ్ చేసినట్లు లేఖ వస్తుందని.. మరి రివ్యూ మీటింగ్ పెట్టమని ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని సర్వే డిమాండ్ చేశారు.

చివరికి మీడియాకు సైతం ఎలాంటి అనుమతి పత్రం చూపించలేదని సత్యనారాయణ స్పష్టం చేశారు. నన్ను సస్పెండ్ చేసినట్లు ఆధారంగా ఏమైనా లెటర్స్ ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు. తాను ఎక్కడ దళితకార్డ్ వాడలేదని.. స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగానని సర్వే చెప్పారు.

35 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించానని చెప్పారు. జనరల్ సీటులో దళిత అభ్యర్థిగా పోటీ చేసి మల్కాజ్‌గిరిలో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందానని సత్యనారాయణ గుర్తుచేశారు.

ప్రజల్లో తన ఇమేజ్ దెబ్బతీసేందుకు టీపీసీసీ పెద్దలు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల గురించి, నియమ నిబంధనల గురించి తెలియని వారు పెద్దలుగా చలామణీ అవుతున్నారని అన్నారు.

click me!