రోగి మృతి..లక్డీకాపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో మళ్లీ ఉద్రిక్తత

By sivanagaprasad kodatiFirst Published Jan 7, 2019, 12:09 PM IST
Highlights

లక్డీకాపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ ఉస్మాన్‌ఖాన్ శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఊపిరితిత్తులు, ఛాతీ సమస్యతో గ్లోబల్‌లో చేరారు.

లక్డీకాపూల్ గ్లోబల్ ఆసుపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. యాకుత్‌పురాకు చెందిన మహ్మద్ ఉస్మాన్‌ఖాన్ శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఊపిరితిత్తులు, ఛాతీ సమస్యతో గ్లోబల్‌లో చేరారు.

పరీక్షించిన వైద్యులు వెంటిలేటర్‌పై చికిత్సనందించాలని సూచించారు. అయితే దానికి కుటుంబసభ్యులు అంగీకరించలేదు. పలు అవయవాలు దెబ్బతినడంతో ఆయన ఆదివారం మరణించారు.

వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆయన చనిపోయారంటూ బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన సంఘటనతో గుణపాఠం నేర్చుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో.. పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం కుటుంబసభ్యులకు నచ్చజెప్పి.. మృతదేహాన్ని ఇంటికి పంపించారు.

కొద్దిరోజుల క్రితం చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మరణించింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆమె కుమారులు, బంధువులు ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు. ఫర్నీచర్‌తో పాటు కంప్యూటర్లు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన పోలీసులపైనా చేయి చేసుకోవడంతో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. 

గ్లోబల్ ఆసుపత్రిలో విధ్వంసం.. నలుగురి అరెస్ట్
 

click me!