కొడుకు, కూతురితో కలిసి మహిళ దొంగతనాలు, అరెస్ట్

By ramya neerukondaFirst Published Nov 19, 2018, 12:56 PM IST
Highlights

కొడుకు, కూతురితో కలిసి ఓ మహిళ గత కొంతకాలంగా నగరంలో యదేచ్చగా దొంగతనాలకు పాల్పడుతోంది. చివరకు అనుకోకుండా ఈ ముగ్గురూ పోలీసులకు చిక్కిపోయారు. 

కొడుకు, కూతురితో కలిసి ఓ మహిళ గత కొంతకాలంగా నగరంలో యదేచ్చగా దొంగతనాలకు పాల్పడుతోంది. చివరకు అనుకోకుండా ఈ ముగ్గురూ పోలీసులకు చిక్కిపోయారు.  సంఘటన హైదరాబాద్ నగరంలోని సరూర్ నగర్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రషీదా బేగం(70), ఆమె కుమార్తె మెహరున్నీసా(37) , సయ్యద్ మహ్మద్(25) లు గత కొంతకాలంగా నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ముగ్గురిపై తెలంగాణ, ఏపీల్లో కలిపి 40కేసులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు వీరు పోలీసులకు చిక్కింది లేదు. కాగా.. అనుకోకుండా తాజాగా పోలీసులకు దొరికిపోయారు.

మెహరున్నీసా.. ఆదివారం సాయంత్రం సరూర్ నగర్ లో కొందరి మహిళల మెడల్లో నుంచి బంగారం చోరీ చేసి వెళ్తోంది. కాగా.. ఆమెను చూసిన పోలీసులకు అనుమానం రాగా.. ఆమెను ఆపి తనిఖీ చేశారు. కాగా.. ఆమె హ్యాండ్ బ్యాగ్ లో బంగారు నగలు లభించాయి. వాటిపై ఆరా తీయగా.. పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో.. ఆమె అవి దొంగతనం చేసిందని తేలిపోయింది.

ఆమెను విచారించగా.. ఆమెతోపాటు తల్లి, సోదరుడి వివరాలను కూడా బయటపెట్టింది. దీంతో వెంటనే పోలీసులు ఆమెతోపాటు మిగితా ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.లక్ష విలువచేసే బంగారు నగలు, నగదు రూ.15వేలు స్వాధీనం చేసుకున్నారు. వారు దోచుకున్న మిగితా సొమ్ము గురించి ఆరా తీస్తున్నారు. వీరు.. ఎక్కువగా గుళ్లు, పాఠశాలలు, షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తూ.. ఆభరణాలు కాజేస్తున్నారని పోలీసులు చెప్పారు. 

click me!