సరూర్ నగర్ పరువు హత్య : ‘అన్నను కలిపించండి... పరువు దక్కిందేమో అడుగుతా..’ నాగరాజు భార్య ఆశ్రిన్...

Published : May 09, 2022, 09:44 AM IST
సరూర్ నగర్ పరువు హత్య : ‘అన్నను కలిపించండి... పరువు దక్కిందేమో అడుగుతా..’ నాగరాజు భార్య ఆశ్రిన్...

సారాంశం

‘నా భర్తను చంపితే నీ పరువు దక్కిందా అన్నా..’ ఇది ఓ చెల్లెలి ఆవేదన. సరూర్ నగర్ పరువు హత్య కేసులో ఆశ్రిన్ సుల్తానా తన అన్నను కలిపిస్తే.. ఇలా అడుగుతానని, ఒక్కసారి కల్పించమని వేడుకుంటోంది. 

వికారాబాద్ :  ‘మా నాన్నకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. చాలా బాగా చూసుకునేవారు. నాన్నకు చెప్పి nagarajuను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. మా సోదరుడు mobin తీవ్రంగా కొట్టాడం వల్లే నాలుగేళ్ల కిందట నాన్న మరణించారు. ఆయన బతికి ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. jailలో ఉన్న మా అన్నతో ఐదు నిమిషాలు మాట్లాడే అవకాశం ఇప్పించండి. ఈ murder చేశాక పరువు దక్కిందేమో అడుగుతా..’ అంటూ ఆశ్రిన్ సుల్తానా కోరుతున్నారు. సోదరి తమకు నచ్చని ప్రేమపెళ్లి చేసుకుందని ఈ నెల 4 న హైదరాబాదులోని saroornagar లో మోబిన్ అహ్మద్ తన బావతో కలిసి నాగరాజును దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆశ్రిన్ వికారాబాద్ జిల్లా మర్పల్లి లో మెట్టినింట ఉంటుంది. ఆమెను కలిసి ఓదార్చేందుకు ప్రజా సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నారు. ఈ సందర్భంగా వచ్చిన వారికి ఆమె తన ఆవేదనను, కుటుంబ పరిస్థితులను, తన సోదరుడి మనస్తత్వం గురించి వివరిస్తున్నారు.

నాగరాజుకు, తనకు ఇంటర్ నుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడిందని తెలిపారు. ఎన్ని  ఇబ్బందులు వచ్చినా కలిసి జీవించాలని కోరికతో తాము పెళ్లి చేసుకున్నామని చెప్పారు. వివాహం చేసుకుంటే అన్న తమను కచ్చితంగా చంపేస్తాడని తన తల్లి కూడా జాగ్రత్తలు చెప్పారని తెలిపారు. మోబిన్  ప్రవర్తన చిన్ననాటి నుంచి క్రూరంగానే ఉండేది అని ఆశ్రిన్ తెలిపారు. తండ్రిని చాలాసార్లు కొట్టాడని.. తమ్ముడినీ ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉండేవాడని.. తండ్రి మరణించాక ఈ ప్రవర్తన మరీ పెరిగింది అన్నారు. హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆశ్రిన్ వేడుకుంటున్నారు.

కాగా, aroor Nagar  honour killing కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. చెల్లెలు ఆశ్రిన్ సుల్తానా ఇష్టం లేని పెళ్లి చేసుకుందన్న కోపంతో రగిలిపోయిన సోదరుడు Syed Mobin అహ్మద్… పథకం ప్రకారమే Nagraju murder చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు మే 6న సయ్యద్ మోబిన్ అహ్మద్,  మహమ్మద్ మసూర్ అహ్మద్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీస్ రిమాండ్ రిపోర్టులో హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల పథక రచన వివరాలను పేర్కొన్నట్లు సమాచారం.

వికారాబాద్ జిల్లా మర్పల్లికి చెందిన నాగరాజు(25), ఆశ్రిన్ సుల్తానా (25) పాఠశాల వయస్సు నుంచి ప్రేమించుకున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరి 1న పాతబస్తీలోని ఆర్యసమాజ్ లో వివాహం చేసుకున్నారు. మే 4న రాత్రి 7గంటల సమయంలో సరూర్ నగర్ వద్ద ద్విచక్ర వాహనంపై వెళ్తున్న  నాగరాజు దంపతులను అడ్డగించి నాగరాజు హతమార్చారు. 

అసలేం జరిగిందంటే…
హత్యకేసులో ప్రధాన నిందితుడు మోబిన్ అహ్మద్ ఇంటికి పెద్ద కుమారుడు. రెండేళ్ల క్రితం తండ్రి మరణించడంతో కుటుంబ భారం  మోబిన్ అహ్మద్ పై పడింది. తల్లి, ముగ్గురు చెల్లెలు, తమ్ముని పోషించేందుకు పండ్లు విక్రయించేవాడు. నిరుడు రెండో సోదరిని  లింగంపల్లికి చెందిన మసూద్ అహ్మద్ కు ఇచ్చి వివాహం చేశాడు. మూడో చెల్లెలు ఆశ్రిన్ సుల్తానాకు ఈ ఏడాది జనవరిలో భార్య మరణించి, ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తితో పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యాడు. సోదరి ఎదురు తిరగడం, కొట్టినా దారికి రాకపోవడంతో గొడవలు పెరిగాయి. దీంతో ఆశ్రిన్ సుల్తానా జనవరి 30న ఇల్లు వదిలి నాగరాజు వద్దకు చేరింది. ఫిబ్రవరి 1న ఇద్దరూ ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లారు. బాల నగర్ పోలీస్ స్టేషన్ లో ఇరు కుటుంబాలను పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తరువాత  నాగరాజు, ఆశ్రిన్ వికారాబాద్ జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. రక్షణ కల్పించాలని కోరారు. రెండుసార్లు నాగరాజు మోబిన్ అహ్మద్ తో మాట్లాడాడు. మతం మారేందుకు తాను సిద్ధమేనంటూ చెప్పాడు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్