
సిద్దిపేట : ఇటీవలి కాలంలో ఇష్టంలేని marriage చేశారంటూ భర్తల్ని చంపేస్తున్న ఘటనలు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని కాబోయే భర్త మెడ కోసిన యువతి ఉదంతం మరువక ముందే అలాంటి మరో ఘటనSiddipet Districtలో వెలుగులోకి వచ్చింది. పెద్దల బలవంతంతో ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ యువతి.. lover మోజులో పడి భర్తను హతమార్చింది. ఒకసారి అన్నంలో విషం కలిపి Murder Attempt చేసింది. అది విఫలం కావడంతో రెండోసారి గొంతు నులిమి చంపేసింది. ఛాతిలో నొప్పితో చనిపోయాడని నాటకం ఆడింది. పోలీసుల దర్యాప్తులో హత్య విషయం వెళ్లడవడంతో జైలుపాలు అయింది. పెళ్లయిన 36 రోజుల్లోనే ఈ హత్య జరగడం గమనార్హం.
సిద్దిపేట జిల్లాలో గత నెల 28న జరిగిన ఈ హత్య కేసు వివరాలను టూటౌన్ సిఐ రవికుమార్ ఆదివారం వెల్లడించారు.
దుబ్బాక మండలం చిన్న నిజాంపేటకు చెందిన కోనాపురం చంద్రశేఖర్ (24)కు తొగుట మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన శ్యామల (19)తో మార్చి 23న పెళ్లయింది గుడికందులకే చెందిన శివ కుమార్ (20), శ్యామల మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దల ఒత్తిడితో చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకున్న ఆమె ప్రియుడు శివతో కలిసి భర్త హత్యకు ప్రణాళిక వేసింది. దీంట్లో భాగంగా ఏప్రిల్ 19న ఆహారంలో ఎలకల మందు కలిగింది. అయితే అనారోగ్యానికి గురైన చంద్రశేఖర్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చాడు. ఫుడ్ పాయిజన్ కావచ్చని, ఆహారంలో తేడా అని భావించాడు.
ఇక రెండో ప్రయత్నంగా ఏప్రిల్ 28న ఆలయంలో మొక్కు ఉందంటూ శ్యామల భర్తను తీసుకొని ద్విచక్రవాహనంపై వెళ్ళింది. అనంతసాగర్ శివారులో ఏకాంతంగా గడుపుదాం... అంటూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్ళింది. అక్కడ మాటువేసి ఉన్న శివ, అతని స్నేహితులు రాకేష్, రంజిత్, మేనబావ సాయి కృష్ణ, వరుసకు సోదరుడు భార్గవ్ కలిసి కారును ద్విచక్ర వాహనానికి అడ్డంగా పెట్టారు. నలుగురి సహకారంతో చంద్రశేఖర్ ను అదిమిపట్టి శ్యామల, శివ కలిసి గొంతు నులిమి చంపేశారు.
తర్వాత చంద్రశేఖర్ మృతదేహాన్ని కారులో సిద్దిపేట శివార్లకు తీసుకువచ్చారు. ఇదే సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని చంద్రశేఖర్ కుటుంబీకులకు ఫోన్ చేసి చెప్పింది శ్యామల. 108కి సమాచారం అందించామని, వాహనంలో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపింది. కుటుంబీకులు వచ్చేసరికి చంద్రశేఖర్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఛాతిలో నొప్పితో చనిపోయాడని శ్యామల బంధువులకు తెలియజేసింది. అయితే చంద్రశేఖర్ తల్లి మనెవ్వ, కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 28న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో శ్యామలపై అనుమానంతో ఆమె కాల్ డేటాను పరిశీలించగా చివర్లో ఎక్కువసార్లు శివతో మాట్లాడినట్లు గుర్తించారు. ఆమెను విచారించగా అసలు విషయం తెలిసింది. దీంతో పోలీసులు నిందితులను ఆదివారం సిద్దిపేటలో న్యాయమూర్తి ఎదుట హాజరుకు తరలించారు నేరానికి పాల్పడిన 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం.