బోయిగూడ అగ్ని ప్రమాదం: నెల రోజులుగా పరారీలోనే.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన టింబర్ డిపో యజమాని

Siva Kodati |  
Published : Apr 19, 2022, 07:25 PM IST
బోయిగూడ అగ్ని ప్రమాదం: నెల రోజులుగా పరారీలోనే.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన టింబర్ డిపో యజమాని

సారాంశం

సికింద్రాబాద్ బోయిగూడ అగ్నిప్రమాదం కేసులో దాదాపు నెల రోజులుగా పరారీలో వున్న టింబర్ డిపో యజమాని సంతోష్ కుమార్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అతనిని గాంధీ నగర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.   

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బోయిగూడ (bhoiguda fire accident) అగ్నిప్రమాదం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23న బోయిగూడలోని టింబర్ డిపోలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నాటి నుంచి పరారీలో వున్నాడు గోదాం యజమాని సంపత్. ఈ క్రమంలో మంగళవారం గాంధీ నగర్ పోలీసులు సంపత్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

అగ్ని ప్రమాదానికి సంబందించి అగ్నిమాపక సిబ్బంది తమ విచారణలో కీలక విషయాలను గుర్తించారు. ఫైరింజన్లు రావడానికి ముందే 11 మంది మరణించారని సిటీ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ మీడియాకు తెలియజేశారు. మార్చి 23వ తేదీ తెల్లవారుజాము మూడు గంటలకు షార్ట్ సర్క్యూట్ తో Fire accident జరిగిందని అగ్నిమాపక శాఖాధికారులు తెలిపారు. అయితే ఫైర్ సిబ్బందికకి మాత్రం తెల్లవారుజామున 3:55 గంటలకు సమాచారం అందిందని ఫైర్ ఆఫీసర్ చెప్పారు.

ఈ సమాచారం అందుకొని ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నాలను మొదలు పెట్టాయి .అయితే  ఈ godownలోనే 11 మంది ఉంటున్నారనే విషయాన్ని ఫైర్ సిబ్బందికి చెప్పలేదని శ్రీనివాస్ తెలిపారు. Scrap గోడౌన్లో కేబుల్స్, పేపర్లు ఉండడంతో మంటలు త్వరగా అంటుకొన్నాయని ఆయన చెప్పారు. ఈ మంటల ధాటికి  పెద్ద ఎత్తున కార్బన్ మోనాక్సైడ్ విడుదలైందన్నారు.  గోడౌన్ ఫస్ట్ ఫ్లోర్‌లో నిద్రపోతున్న వారంతా ఈ కార్బన్ మోనాక్సైడ్ పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి సజీవ దహనమయ్యారని శ్రీనివాస్ వెల్లడించారు. 11 మంది ఒకరిపై మరొకరు పడి సజీవ దహనమయ్యారని ఆయన వివరించారు.

ఫస్ట్‌ప్లోర్‌లో 11 మంది ఉన్నారనే విషయాన్ని తమ సిబ్బందికి ముందుగానే సమాచారం ఇస్తే వారిని కాపాడే ప్రయత్నం చేసే వాళ్లమని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రమాదం నుండి గాయాలతో బయటపడిన ప్రేమ్ కుమార్ ఇచ్చిన  సమాచారం ఆధారంగా తమ సిబ్బంది ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లి చూస్తే అప్పటికే 11 మంది సజీవ దహనమయ్యారని శ్రీనివాస్ వివరించారు. ప్రమాదంలో మరణించిన వారంతా బీహార్ కూలీలే కావడం గమనార్హం. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ ప్రేమ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. బిహార్‌ చాప్ర జిల్లాలోని ప్రేమ్‌కుమార్‌ (20) గత కొంతకాలంగా శ్రావణ్ స్క్రబ్ ట్రేడర్స్ గోదాంలో కార్మికుడుగా పని చేస్తున్నాడు.

ప్రమాదం జరిగిన  రోజు మంటల నుంచి తప్పించుకొని కిటికీలో నుంచి ప్రేమ్‌కుమార్‌ బయటకు దూకాడు. తీవ్రగాయాల పాలైన అతనిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. దాదాపు 24 నాలుగు రోజులుగా ప్రాణాలతో పోరాడుతున్న ప్రేమ్ కుమార్ జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ప్రేమ్ కుమార్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న
Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu