ఇంటర్ ఫలితాలు మరింత ఆలస్యం: హైకోర్టుకు తెలిపిన బోర్డు, ఎందుకంటే..!!

By Siva KodatiFirst Published May 8, 2019, 11:45 AM IST
Highlights

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల కేసుపై రాష్ట్ర హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదని, ఇంటర్ బోర్డు పూర్తి వివరాలు సమర్పించడానికి వారం రోజులు పడుతుందని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానికి తెలిపారు

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల కేసుపై రాష్ట్ర హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఫెయిలైన విద్యార్ధుల రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఇంకా పూర్తికానందునపూర్తి వివరాలు సమర్పించడానికి వారం రోజులు పడుతుందని అడ్వకేట్ జనరల్ న్యాయస్థానికి తెలిపారు

దీనిపై స్పందించిన కోర్టు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తి వివరాలు సమర్పించాలని ఇంటర్ బోర్డును ఆదేశించి, తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. కాగా, ఈ నెల 10న ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు ఇప్పటికే ప్రకటించింది. గ్లోబరీనా సంస్థను పిటిషనర్లు ప్రతివాదులుగా చేర్చారు.  

click me!