టీఆర్ఎస్‌తో పొత్తు ఓకే, రాహుల్ ప్రధాని కావాలి..తెలంగాణ అనవసరం: జగ్గారెడ్డి

By Siva KodatiFirst Published May 16, 2019, 8:26 PM IST
Highlights

ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమకు రాష్ట్ర రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు.

ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తమకు రాష్ట్ర రాజకీయాల కంటే దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్ధతుతో ప్రధాని అయ్యే పరిస్ధితే వస్తే రాష్ట్రంలో అధికారం విషయాన్ని పట్టించుకోబోమని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 40 రోజుల తర్వాత ఎంపీపీ, జడ్పీ ఛైర్మన్‌లను ఎన్నుకోవడం దారుణమన్నారు. పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్‌ రెడ్డిని కొనసాగించాలని అధిష్టానానికి లేఖ రాస్తానని జగ్గారెడ్డి తెలిపారు. అలాగే పీసీసీ అధ్యక్ష పదవులను మొదటి విడతలో శ్రీధర్‌బాబుకి, రెండో విడతలో రేవంత్ రెడ్డికి ఇవ్వాలని కోరుతానని ఆయన స్పష్టం చేశారు. 

click me!