నాథూరామ్ దేశ భక్తుడు: సాద్వీ క్షమాపణలు చెప్పాలన్న కేటీఆర్

Published : May 16, 2019, 06:15 PM IST
నాథూరామ్ దేశ భక్తుడు:  సాద్వీ క్షమాపణలు చెప్పాలన్న కేటీఆర్

సారాంశం

మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను బీజేపీ అభ్యర్థి సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాద్వీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు

హైదరాబాద్:  మహాత్మాగాంధీని చంపిన నాథూరాం గాడ్సేను బీజేపీ అభ్యర్థి సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలపై  విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాద్వీ వ్యాఖ్యలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గతంలో, భవిష్యత్తులోనూ గాడ్సే దేశ భక్తుడిగానే ఉంటారని ఆమె చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా  ఆయన స్పందించారు.

 

 

ప్రతి దానికి హద్దులు ఉంటాయన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు జాతికి ఆమె భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరో వైపు ఇదే వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు.

తమిళనాడులో ఎంఎన్ఎం చీఫ్, సినీ నటుడు కమల్ హాసన్ నాథూరామ్ గాడ్సేపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ గురువారం నాడు స్పందించారు. భోపాల్‌ నుండి బీజేపీ అభ్యర్థిగా ఆమె పోటీలో ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి