
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని నియమితులైన నేపథ్యంలో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు. రేవంత్ నియామకానికి సంబంధించి తనకు అధికారికంగా సమాచారం అందలేదన్నారు. పార్టీ నిర్ణయం ఏదైనప్పటికీ సోనియా, రాహుల్ గాంధీల నాయకత్వంలో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. పీసీసీ చీఫ్ విషయంలో తమ మధ్య భిన్నాభిప్రాయాలు వున్నప్పటికీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని జగ్గారెడ్డి తెలిపారు.
Also Read:తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అధికారిక ప్రకటన
అలాగే సోషల్ మీడియాలో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేసే చెత్త బ్యాచ్ తాట తీస్తామని జగ్గారెడ్డి హెచ్చరించారు. దళిత సమస్యలపై సీఎం కేసీఆర్‌ను కలవడాన్ని కొందరు చెత్త వెధవలు తప్పు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి చెత్త బ్యాచ్ తాట తీస్తామని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని కొందరు భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తమ పైన అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై సీఎంలను కలిసే సంప్రదాయం గతంలో కూడా ఉందని జగ్గారెడ్డి గుర్తుచేశారు.