తెలంగాణలో భారీగా పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 1,028 మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Jun 26, 2021, 07:55 PM IST
తెలంగాణలో భారీగా పడిపోయిన కరోనా కేసులు: కొత్తగా 1,028 మందికి పాజిటివ్

సారాంశం

తెలంగాణలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడిచిన 24 గంటల్లో 1,18,427 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,028 మందికి పాజిటివ్‌గా తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 132 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 76 కేసులను గుర్తించారు. 

తెలంగాణలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. గడిచిన 24 గంటల్లో 1,18,427 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,028 మందికి పాజిటివ్‌గా తేలింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 132 కొత్త కేసులు నమోదు కాగా, ఖమ్మం జిల్లాలో 76 కేసులను గుర్తించారు. అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 1 కేసు వెల్లడైంది. అదే సమయంలో 1,489 మంది కరోనా నుంచి కోలుకోగా, 9 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు కరోనా మృతుల సంఖ్య 3,627కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,19,865 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,01,184 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,054 యాక్టివ్ కేసులు వున్నాయి. 

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 5, భద్రాద్రి కొత్తగూడెం 46, జీహెచ్ఎంసీ 132, జగిత్యాల 21, జనగామ 8, జయశంకర్ భూపాలపల్లి 20, గద్వాల 5, కామారెడ్డి 1, కరీంనగర్ 58, ఖమ్మం 76, ఆసిఫాబాద్ 7, మహబూబ్‌నగర్ 18, మహబూబాబాద్ 53, మంచిర్యాల 42, మెదక్ 5, మేడ్చల్ మల్కాజిగిరి 43, ములుగు 27, నాగర్ కర్నూల్ 12, నల్గగొండ 66, నారాయణపేట 5, నిర్మల్ 2, నిజామాబాద్ 8, పెద్దపల్లి 48, సిరిసిల్ల 17, రంగారెడ్డి 64, సిద్దిపేట 38, సంగారెడ్డి 12, సూర్యాపేట 65, వికారాబాద్ 13, వనపర్తి 17, వరంగల్ రూరల్ 24, వరంగల్ అర్బన్ 45, యాదాద్రి భువనగిరిలో 25 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం