బిజెపికి షాక్... రాజీనామా చేసిన జిల్లా అధ్యక్షుడు

By Arun Kumar PFirst Published Nov 1, 2018, 4:04 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో రాజకీయ వేడిన రాజేస్తున్నాయి. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇలా అభ్యర్థులను ప్రకటించిన పార్టీకి అసమ్మతులు తలనొప్పిగా మారారు. టికెట్ ఆశించి భంగపడిన వారు ఇతర పార్టీల్లో చేరడం లేదా స్వతంత్రులుగా పోటీకి దిగుతామని ప్రకటిస్తుండటంతో ఆయా పార్టీలకు ఆందోళన కల్గిస్తోంది. తాజాగా ఈ అసమ్మతి సెగ తెలంగాణ బిజెపికి తాకింది. 
 
సంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి తన పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పలువురు జిల్లా నాయకులు, అనుచరులు, బిజెపి కార్యకర్తలు పార్టీని వీడనున్నట్లు ప్రకటించారు.. బుచ్చిరెడ్డి వెంటే తామూ ఉంటామని వారు ప్రకటించారు. 

ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ...బిజెపి పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సరైన గుర్తింపు లేకుండా  పోతోందన్నారు. రెండు సార్లు సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బిజెపి సిద్దాంతాలకు కట్టుబడి పనిచేశానని వెల్లడించారు. అయితే ఈ సారి తనకు బిజెపి తరపున సంగారెడ్డి టికెట్‌ వస్తుందని ఆశించానని...కానీ  పార్టీలోని కొందరు నాయకులు తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. అందువల్ల మనస్థాపంతోనే రాజీనామా చేస్తున్నట్లు బుచ్చిరెడ్డి ప్రకటించారు.

బీజేపీ పార్టీ కూడా సామాన్య కార్యకర్తలకు కాకుండా డబ్బున్న వారికే  అవకాశాలిస్తోందని మండిపడ్డారు. దీంతో పార్టీ కోసం పనిచేసే సామాన్య నాయకుల పార్టీకి దూరమవుతున్నారని అన్నారు. అలాంటి వారిని పార్టీ గుర్తించకకోవడం బాధాకరమని అన్నారు. అయితే తాను ఏ పార్టీలో చేరేది త్వరలో ప్రకటిస్తానని బుచ్చిరెడ్డి వెల్లడించారు. 

ఇటీవలే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి  పార్టీపై తిరుగుబాటు చేసి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీజేపీలో  తనకు తీవ్ర అన్యాయం జరిగిందని అతడు పేర్కొంటూ రాజీనామా చేసి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కూడా పార్టీని వీడటంతో పార్టీలో అలజడి మొదలైంది. 

మరిన్ని వార్తలు

బిజెపికి షాక్.... టీఆర్ఎస్‌‌లో చేరిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు

 తెలంగాణ బిజెపికి తాకిన అసమ్మతి సెగ...జిల్లా అధ్యక్షుడి రాజీనామా

click me!