ప్రేమ పెళ్లి..హనీమూన్ డబ్బుల కోసం వేధింపులు.. డాక్టర్ ఆత్మహత్య

By ramya neerukondaFirst Published Nov 1, 2018, 3:16 PM IST
Highlights

పెళ్లి జరిగిన తర్వాత ఆనందంగా హనీమూన్ కి కూడా వెళ్లి వచ్చారు. అక్కడ మొదలైంది అసలు సమస్య. 

ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. పెళ్లి జరిగిన తర్వాత ఆనందంగా హనీమూన్ కి కూడా వెళ్లి వచ్చారు. అక్కడ మొదలైంది అసలు సమస్య. హనీమూన్ కి వెళ్లిరావడానికి అయిన ఖర్చంతా..వధువు తండ్రే ఇవ్వాలంటూ వరుడు పట్టుపట్టాడు. అప్పటికే పెళ్లి ఖర్చులు, కట్నానికి రూ.లక్షలు ఖర్చుచేసిన యువతి తండ్రి ఇవ్వనంటూ తేల్చిచెప్పాడు. అంతే అప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఆ వేధింపులు తట్టుకోలేక.. ఆమె మూడేళ్లుగా స్లోపాయిజన్ తీసుకొని చనిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన డాక్టర్ గురవయ్యకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె జయశ్రీ చైనా డాక్టర్ చదవింది. ఆ సమయంలో నగరానికి చెందిన కార్తీక్ అనే యువకుడిని ప్రేమించింది. పెద్దల అంగీకారంతో కార్తీక్, జయశ్రీలు 2015 నవంబర్ లో పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు.

వివాహనం అనంతరతం నవదంపతులు ఇద్దరూ హనీమూన్ కి వెళ్లారు. ఆ హనీమూన్ అయిన ఖర్చు ఇవ్వాలంటూ గురవయ్యని అల్లుడు కార్తీక్ కోరగా అందుకు ఆయన నిరాకరించారు. అప్పటికే పెళ్లికి రూ.25లక్షల నగదు, 45తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. మళ్లీ నగదు అడిగేసరికి ఆయన ఇవ్వనని భీష్మించుకున్నాడు.

అంతే అప్పటి నుంచి భార్య జయశ్రీని వేధించడం మొదలుపెట్టారు. డాక్టర్ అయిన జయశ్రీ .. ఈ వేధింపులు తాళలేక మూడు సంవత్సరాల నుంచి గుండె వేగాన్ని తగ్గించే మందులు(స్లోపాయిజన్) తీసుకోవడం మొదలుపెట్టింది. కాగా.. ఈ క్రమంలో జయశ్రీ బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించగా.. చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

భర్త, అత్తమామ వేధింపులు తట్టుకోలేకే తన కుమార్తె చనిపోయిందని గురవయ్య ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!