సీరియస్ గా ప్రయత్నిస్తున్నా, నేను 11వ వాడ్ని: జగ్గారెడ్డి సంచలనం

Published : Nov 16, 2019, 02:48 PM ISTUpdated : Nov 20, 2019, 03:11 PM IST
సీరియస్ గా ప్రయత్నిస్తున్నా, నేను 11వ వాడ్ని: జగ్గారెడ్డి సంచలనం

సారాంశం

తెలంగాణ పీసీాసీ అధ్యక్ష పదవి కోసం తాను సీరియస్ గా ప్రయత్నిస్తున్నంట్లు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పారు. పీసీసీ పీఠం కోసం పది మంది ప్రయత్నిస్తున్నారని, తాను 11వ వాడినని ఆయన చెప్పారు.

సంగారెడ్డి: కాంగ్రెసు పార్టీపై సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం తాను సీరియస్ గా ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 20వ తేదీ తర్వాత తాను సోనియా, రాహుల్ గాంధీలను కలుస్తానని చెప్పారు. 

టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పది మంది ప్రయత్నిస్తున్నారని, తాను 11వ వాడినని ఆయన చెప్పారు. తనకు అధ్యక్ష పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని, పార్టీ విజయం కోసం పూర్తి కాలం పనిచేస్తానని ఆయన చెప్పారు. 

Also Read: అన్ని పార్టీలు తిరిగా....వారిని నిలువరించే దమ్ముంది, పీసీసీ చీఫ్‌ పదవిపై జగ్గారెడ్డి కన్ను

తనకు అధ్యక్ష పదవి ఇస్తే సంగారెడ్డి నుంచి వేరేవాళ్లను పోటీ చేయించి గెలిపిస్తానని జగ్గారెడ్డి చెప్పారు. తెలంగాణ పిసిసీ అధ్యక్ష పదవి కోసం జగ్గారెడ్డి ఇదివరకే దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో తనపై ఉన్న కేసుల వివరాలను కూడా పొందుపరిచారు.

తెలంగాణ పిసిసీ అధ్యక్ష పదవి నుంచి నల్లగొండ లోకసభ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డి సహా పలువురు పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డికి పాత సీనియర్ కాంగ్రెసు నేతల నుంచి వ్యతిరేకత ఎదరవుతోంది.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్