ఎలా ఉన్నా పర్వాలేదు..బ్రతికితే చాలు. దాడికి గురైన భార్యపై సందీప్

Published : Sep 20, 2018, 02:11 PM ISTUpdated : Sep 20, 2018, 02:19 PM IST
ఎలా ఉన్నా పర్వాలేదు..బ్రతికితే చాలు. దాడికి గురైన భార్యపై సందీప్

సారాంశం

తన ప్రాణాలకు మాధవి తన ప్రాణం అడ్డుపెట్టిందని.. ఆమెకు ఏమైనా అయితే తాను తట్టుకోలేనని భోరున విలపించాడు. 

చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భార్య మాధవి ప్రాణాలతో బయటపడితే తనకు అదేచాలని సందీప్ పేర్కొన్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న సందీప్, మాధవి దంపతులపై మాధవి తండ్రి.. బుధవారం సాయంత్రం కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కాగా.. సందీప్ తృటిలో స్వల్ప గాయాలతో బయటపడగా.. మాదవి పరిస్థితి విషమంగా ఉంది. 

కాగా.. తన భార్య ఆరోగ్య పరిస్థితిపై సందీప్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. తన ప్రాణాలకు మాధవి తన ప్రాణం అడ్డుపెట్టిందని.. ఆమెకు ఏమైనా అయితే తాను తట్టుకోలేనని భోరున విలపించాడు. ఇంటికి వచ్చి వారం రోజులే అయ్యిందని.. అందరితో కలిసిపోయిందని.. ఇంతలోనే ఇలా జరిగిందని వాపోయాడు. ఆమెకు ఏమైనా అయితే తానూ చనిపోతానంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ‘కులం.. కులం అంటున్నారు.. తక్కువ కులంలో పుట్టడం నేరమా’ అని సందీప్ ప్రశ్నించాడు. అసలు మాధవి మనసులో ఏముందో ఎప్పుడైనా కనుక్కున్నారా అంటూ ఆమె కుటుంబ సభ్యులపై మండిపడ్డాడు.
 
మాధవి ఆరోగ్యంపై నిజాలు దాస్తున్నారని అనుమానం వ్యక్త చేశాడు. తను ఎలా ఉన్నా ఫర్వాలేదని.. బతికి వస్తే చాలని తెలిపాడు. అడుక్కోనైనా.. రిక్షా తొక్కైనా ఆమెను పోషిస్తానని చెప్పాడు. తన కుటుంబాన్ని, మాధవిని సంతోషంగా చూసుకుంటానన్నాడు. మరోవైపు మాధవి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు యశోదా వైద్యులు. మాధవి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్న డాక్టర్లు.. ప్రస్తుతం వెంటిలేర్‌పై చికిత్స పొందుతోందని తెలిపారు.

read more news

మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu