టీపీసీసీ కొత్త కమిటీల ఎఫెక్ట్: ట్విస్టిచ్చిన సుధీర్ రెడ్డి

By narsimha lodeFirst Published Sep 20, 2018, 12:51 PM IST
Highlights

:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా తాను కొనసాగలేనని... సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కమిటీ పట్ల ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సభ్యుడిగా తాను కొనసాగలేనని... సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కమిటీ పట్ల ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎన్నికల కమిటీలో తాను కొనసాగలేనని మీడియాకు లేఖను పంపారు.ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి కూడ తెలిపినట్టు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీ కొత్త కమిటీని బుధవారం సాయంత్రం ప్రకటించింది.  ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లు, 9 అనుబంధ కమిటీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిటీల ఏర్పాటుపై  తెలంగాణ కాంగ్రెస్‌లో వేడి పుట్టింది.

పార్టీ సీనియర్లు కొందరు తాము కోరుకొన్న పదవులు దక్కలేదనే కారణంగా పార్టీ అధిష్టానంపై  ఆగ్రహంతో ఉన్నారు. వీహెచ్ ఏకంగా కాంగ్రెస్ పార్టీలో  కేసీఆర్ కోవర్టులున్నారని ఆరోపించారు. 

తాజాగా ప్రకటించిన ఎన్నికల కమిటీలపై ఎల్బీనగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ అధిష్టానానికి లేఖ రాశాడు. సుధీర్ రెడ్డికి ఎన్నికల కమిటీలో స్థానం కల్పించారు. ఈ కమిటీలో స్థానం కల్పించడంపై  ఆయన అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల కమిటీలో తాను కొనసాగలేనని ప్రకటించారు.  అంతేకాదు తాను పార్టీలో సామాన్య కార్యకర్తగానే కొనసాగుతానని ప్రకటించారు.

సంబంధిత వార్తలు

టీపీసీసీ కొత్త కమిటీ ఎఫెక్ట్: కాంగ్రెస్‌లో కేసీఆర్ కోవర్టులు: వీహెచ్

రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌లో నిరసన సెగ

కాంగ్రెస్ తీరు: కారెక్కిన సురేష్‌రెడ్డికి మూడు కమిటీల్లో చోటు

ఎన్నికల కమిటీలు: కాంగ్రెస్‌లో ఇక రేవంత్ జోరు

click me!