మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

Published : Sep 20, 2018, 10:43 AM IST
మాపై దాడికి ఆమె కారణం, మాధవికి బ్రెయిన్ వాష్ చేసేది: సందీప్ సంచలనం

సారాంశం

తమపై  మనోహారాచారి దాడి చేయడం వెనుక తమ అత్తే ప్రధాన కారణమని ఈ దాడిలో గాయపడిన  సందీప్ చెప్పారు.  ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ సమీపంలో  బుధవారం సాయంత్రం మనోహారాచారి చేసిన దాడిలో సందీప్, మాధవి తీవ్రంగా గాయపడ్డారు


హైదరాబాద్: తమపై  మనోహారాచారి దాడి చేయడం వెనుక తమ అత్తే ప్రధాన కారణమని ఈ దాడిలో గాయపడిన  సందీప్ చెప్పారు.  ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ సమీపంలో  బుధవారం సాయంత్రం మనోహారాచారి చేసిన దాడిలో సందీప్, మాధవి తీవ్రంగా గాయపడ్డారు. మాధవి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత సందీప్ ఆసుపత్రి నుండి డిశ్చార్చి అయ్యారు.

ఈ సందర్భంగా సందీప్ గురువారం నాడు మీడియాతో మాట్లాడారు. అసలు ఈ దారుణాలన్నింటికి కారణం తన అత్తేనని తెలిపాడు. ఆమె పదేపదే కులం ముఖ్యమని మాధవికి చెప్పేదన్నాడు. ఆస్తి లేకపోయినా మన కులం వాడినే పెళ్లి చేసుకోవాలి... బయటవాళ్లు వద్దేవద్దు అని మాధవికి బ్రెయిన్ వాష్ చేసేదన్నారు. 

కానీ  మాధవి తనను పెళ్లి చేసుకోవడంతో ఆమె మనోహరాచారిని రెచ్చగొట్టి ఈ హత్యాయత్నం చేయించిందని ఆరోపించాడు. తమ ప్రేమ గురించి 2015, 2018లో రెండు సార్లు మాధవి ఇంట్లో చెప్పిందని వెల్లడించాడు. 

దీంతో అప్పట్లోనే తనను చంపేస్తానని మాధవి తల్లి హెచ్చరించిందని అన్నాడు. కుమార్తెను చూడాలని ఉందని పిలిపించి దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ కుటుంబంతో మాధవి చక్కగా కలిసిపోయిందని సందీప్ చెప్పారు.

సంబంధిత వార్తలు

తండ్రి దాడి: మాధవి పరిస్థితిపై ఇప్పుడే చెప్పలేమంటున్న డాక్టర్లు

ఎస్ఆర్ నగర్ దాడి: లొంగిపోయిన మనోహరాచారి, మాధవి పరిస్థితి విషమం

ఎస్ఆర్ నగర్ దాడి: నమ్మించి నవదంపతులను నరికిన అమ్మాయి తండ్రి

టెన్త్ క్లాస్‌ నుండే ప్రేమ: కులాంతర వివాహం నచ్చకే తండ్రి దాడి

నవదంపతులపై దాడి: బట్టలు పెడతామని పిలిచి ఘాతుకం (వీడియో)

ప్రణయ్ హత్య మరవకముందే.. నగరంలో మరో సంఘటన

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ఏఐ డేటా సెంటర్.. ఈ ప్రాంతం మరో హైటెక్ సిటీ కావడం ఖాయం
Kavitha Kalvakuntla Pressmeet: రేవంత్ రెడ్డి, హరీష్ రావుపై రెచ్చిపోయిన కవిత| Asianet News Telugu