తెలంగాణ- మహారాష్ట్రాల మధ్య ఇసుక చిచ్చు.. క్వారీల నిర్వహణకు ‘‘మహా’’ స్కెచ్

By Siva KodatiFirst Published Apr 18, 2021, 4:37 PM IST
Highlights

తెలంగాణ- మహారాష్ట్రాల మధ్య ఇసుక వివాదం రగులుతోంది. ఇసుక దోపిడీకి సంబంధించి మహా ప్రణాళికను రూపొందించింది. మంజీరా నదిలో ఒక్కో క్వారీకి నిర్ణీత ధర నిర్ణయించి మరీ వేలం పాట ముగించింది.

తెలంగాణ- మహారాష్ట్రాల మధ్య ఇసుక వివాదం రగులుతోంది. ఇసుక దోపిడీకి సంబంధించి మహా ప్రణాళికను రూపొందించింది. మంజీరా నదిలో ఒక్కో క్వారీకి నిర్ణీత ధర నిర్ణయించి మరీ వేలం పాట ముగించింది.

మొత్తంగా సుమారు రూ.100 కోట్ల ఆదాయాన్నిచ్చేలా 25కు మించి ఇసుక క్వారీల నిర్వహణకు నాందేడ్‌ అధికారులు వేలం పూర్తిచేశారు. ఈ నేపథ్యంలో నది సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి రావటంతో నిజామాబాద్‌ జిల్లా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. 

నిజాం పాలన ముగిశాక నదిని మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుగా నిర్ణయించారు. నదీజలాల వరకే పరిమితమైన అంశం తాజాగా ఇసుక తవ్వకాల దాకా రావడంతో రెండు ప్రాంతాలలో వివాదం మొదలైంది.

రెండు రాష్ట్రాల పాలకులు సమాన ఖర్చుతో 1980 దశకంలో సాలూరా వద్ద కిలోమీటరు పొడవైన వారధి నిర్మించాయి. నదిని మధ్యగా చీలుస్తూ సమాన హక్కులు నిర్ణయించారు.

పొరుగు రాష్ట్రం ఇసుక తవ్వకాలకు దిగినప్పుడల్లా జిల్లా యంత్రాంగం నదిలో హద్దురాళ్లు పాతిరావడం.. వాటిని తొలగించి పొరుగు జిల్లా అధికారులు భారీగా యంత్రాల సాయంతో ఇసుకను తవ్వుకుపోవడం నిత్యకృత్యమైంది. దీనిని ఆపడానికి అధికారులు ప్రతి సందర్భంలో తీవ్ర ప్రతిఘటన, భౌతిక దాడులు ఎదుర్కొన్నారు.   
 

click me!