రెండేళ్లలో తెలంగాణలో అధికారంలోకి, నిరుద్యోగాన్ని నిర్మూలిస్తాం: వైఎస్ షర్మిల

By narsimha lodeFirst Published Apr 18, 2021, 12:57 PM IST
Highlights

రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి  వస్తోందని  వైఎస్ షర్మిల  ధీమాను వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే  నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేస్తామని ఆమె చెప్పారు.

హైదరాబాద్: రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి  వస్తోందని  వైఎస్ షర్మిల  ధీమాను వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే  నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలించే ప్రయత్నం చేస్తామని ఆమె చెప్పారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని  డిమాండ్ చేస్తూ  72 గంటల దీక్షను షర్మిల ఆదివారం నాడు విరమించారు. ఉద్యోగం కోసం ఆత్మహత్య చేసుకొన్న అమరవీరుల కుటుంబ సభ్యులు షర్మిలకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు.

also read:కొండా సురేఖ దంపతులకు వైఎస్ షర్మిల పిలుపు: కొండా మురళి సంచలన వ్యాఖ్య...

ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.  ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని కోరుతూ నిరుద్యోగులు  ఆత్మహత్య చేసుకొంటే చలించని మీది గుండెనా బండరాయా అని  ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.పాలకుల చిత్తశుద్ది ఏమిటో ప్రజలు గమనించాలని ఆమె కోరారు. నిరుద్యోగుల మరణాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని ఆమె చెప్పారు. ఉద్యోగాల విషయంలో  ప్రశ్నించాల్సిన పత్రిపక్ష  నేతలు చేతులకు గాజులు వేసుకొన్నారని ఆమె మండిపడ్డారు. అంతేకాదు చేతులకు గాజులు వేసుకొని కేసీఆర్ ముందు డ్యాన్సులు చేస్తున్నారని ఆమె విమర్శించారు.

also read: రెండో రోజూ లోటస్‌పాండ్ లో కొనసాగుతున్న షర్మిల దీక్ష...

మమ్మల్ని  హింసించారని డీజీపీకి ఫిర్యాదు చేస్తే తీసుకోలేదన్నారు. పాలకులకు సిగ్గుండాలి, మహిళపైనా మీ ప్రతాపమా అని ఆమె అడిగారు. యూనివర్శిటీల్లో 67 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసే వరకు పోరాటం ఆగదని ఆమె తేల్చి చెప్పారు. ఈ విషయమై తాను పోరాడుతా నే నిలబడతా,  మిమ్మల్ని నిలబెడతానని ఆమె హామీ ఇచ్చారు.ప్రతి కార్యక్రమంలో ఉద్యోగ నోటిఫికేషన్ పై నిరసన తెలుపుతామన్నారు.

click me!