గుండెలు పిండి చేసే ముచ్చట ఇది

Published : Feb 14, 2018, 07:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
గుండెలు పిండి చేసే ముచ్చట ఇది

సారాంశం

తల్లి చనిపోయినా.. తల్లి పక్కనే నిద్రించిన పసిబాలుడు కదలించిన సంఘటన హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో ఘటన

గుండెలు పిండి చేసే ముచ్చట ఇది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో జరిగింది. ఏం జరిగిందో చదవండి.

సమీనా సుల్తానా హైదరాబాద్ లోని అత్తాపూర్ లో నివాసముంటోంది. ఆమెకు ఐదేళ్ల కొడుకున్నాడు. మూడేళ్ల క్రితం కట్టుకున్న భర్త వదిలి వెళ్లిపోవడంతో కూలీ పనులు చేస్తూ..తన కుమారుడిని పోషించుకుంటోంది. సుల్తానా చాలా రోజుల నుంచి గుండె సమస్యతో బాధపడుతోంది.

మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో స్థానికులు ఆమెను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. తల్లితోపాటు ఆస్పత్రికి వచ్చిన కుమారుడికి తన తల్లి చనిపోయిందన్న సంగతి తెలియదు. అమ్మ.. అమ్మా.. అని పిలిచాడు.. ఎంతకీ పలకలేదు. అలాగే పిలుస్తూ పిలుస్తూ అలసి ఆ తల్లి పక్కనే పడుకుని నిద్రపోయాడు. ఆ చిన్నారికి తెలియదు అమ్మ అప్పటికే చనిపోయింది అని..

ఊహ తెలిసినప్పటి నుంచి తల్లి ఒడిలోనే పడుకున్నాడు. చివరి శ్వాస సమయంలోనూ.. అమ్మఒడిలోనే సేదతీరాడు ఆ  పసిబాలుడు.

ఈ దృశ్యాన్ని చూసి చలించిపోయిన హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ వాలంటీర్లు,వైద్య సిబ్బంది ఆ చిన్నారిని తల్లి మృతదేహం పక్క నుంచి తీసి..వేరే గదిలో పడుకోబెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె వేలి ముద్రలు, ఆధార్ కార్డ్ లోని సమాచారంతో జహీరాబాద్ లోని బందువులకు విషయాన్ని తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించారు.

అమ్మ చనిపోయిందని బంధువులు,ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నా…బతికే ఉందంటూ తల్లిని గట్టిగా పట్టుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఆ చిన్నారిని చూసి కళ్ల నీళ్లు ఆపుకోలేకపోయారు. చివరకు సర్ధి చెప్పి జహీరాబాద్ లో అంత్యక్రియలు నిర్వహించారు.

 

PREV
click me!

Recommended Stories

మనల్ని ఎవర్రా ఆపేది.. తెలంగాణలో తిరుగుతాం..పవన్ కళ్యాణ్ | Pawan Kalyan Latest Speech| Asianet Telugu
తెలంగాణ రాజకీయాల్లో దడ పుట్టించే పవన్ ఫైర్ స్పీచ్ | Pawan Kalyan Pressmeet | Asianet News Telugu