సమత కేసు: కోర్టు హాల్‌లో కన్నీళ్లు పెట్టుకొన్న నిందితులు

By narsimha lodeFirst Published Jan 30, 2020, 1:14 PM IST
Highlights

ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సమత గ్యాంగ్ రేప్, హత్య కేసులో నిందితులు గురువారం నాడు కన్నీళ్లు పెట్టుకొన్నారు. 

ఆదిలాబాద్: సమతపై గ్యాంగ్‌ రేప్, హత్య కేసులో గురువారం నాడు ఆదిలాబాద్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో నిందితులు కన్నీళ్లు పెట్టుకొన్నారు.గురువారం నాడు ఉదయం  ఆదిలాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు హల్ లోకి నిందితులను పిలిపించారు జడ్జి. నిందితుల కుటుంబాల గురించి జడ్జి ఆరా తీశారు.

ఇది ప్రజల విజయం: సమత కేసులో దోషులకు ఉరిపై పీపీ

సమత కేసులో దోషులకు ఉరి: ఎస్పీ కాళ్లు మొక్కిన భర్త గోపి


నేరం రుజువైందని ఫాస్ట్ ట్రాక్ కోర్టు జడ్జి నిందితులకు చెప్పారు. అయితే ఈ సమయంలో తమ కుటుంబాలకు తామే ఆధారమని నిందితులు జిల్లా జడ్జికి చెప్పాురు.తనకు భార్య పిల్లలు,  తల్లిదండ్రులు ఉన్న విషయాన్ని ఈ కేసులో ఏ1  నిందితుడు బాబా జడ్జి దృష్టికి తీసుకొచ్చారు.

 తన కుటుంబాన్ని తానే చూసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన జడ్జికి వివరించారు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి గురైన బాబా కోర్టు హాల్‌లోనే కన్నీళ్లు పెట్టుకొన్నారు. మిగిలిన నిందితులు కూడ ఆయనతో పాటే భావోద్వేగానికి గురయ్యారు. 

సమత కేసులో నిందితులకు ఉరిశిక్ష... గ్రామస్తులు ఏమంటున్నారంటే

 

click me!