మేల్, ఫీమేల్ ఎస్కార్ట్‌: మోసం చేసిన దుర్గాప్రసాద్ అరెస్ట్

By narsimha lodeFirst Published Jan 30, 2020, 12:08 PM IST
Highlights

మేల్, పీ‌మేల్ పేరుతో మోసం చేసిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. 


హైదరాబాద్: మేల్, ఫీమేల్ ఎస్కార్ట్ పేరుతో వందలాది మంది నుండి డబ్బులు వసూలు చేసిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

హైద్రాబాద్‌ కేంద్రంగా  లొకాంటో వెబ్‌సైట్‌లో మేల్, పీమేల్ ఎస్కార్ట్  సరఫరా చేస్తామని నిర్వాహకుడు దుర్గాప్రసాద్ వందలాది మంది నుండి డబ్బులు వసూలు చేశాడు.

Also read:కర్నూల్‌లో దారుణం: మైనర్ బాలుడిపై నలుగురి లైంగిక దాడి, అస్వస్థత

ప్రతి రోజు నుండి కనీసం రూ. 15 వేలు సంపాదించే అవకాశం ఉందని ఈ వెబ్‌సైట్ నిర్వాహకుడు తన సైట్‌లో పబ్లిసీటీ చేశాడు. ఈ సైట్‌లో డబ్బులు సంపాదించాలంటే రిజిస్ట్రేషన్ ఫీజు కింద కనీసం రెండు వేలను  కట్టాలని నిందితుడు ఆశలు కల్పించాడు.

ఈ వెబ్‌సైట్‌ను నమ్మిన వందలాది మంది బాధితులు దుర్గాప్రసాద్ ఇచ్చిన బ్యాంకు అకౌంట్‌లో డబ్బులు వేశారు. అయితే బాధితులు తాము మోసపోయినట్టుగా గుర్తించారు.

కొందరు బాధితులు హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగు చూసింది. నిందితుడు దుర్గాప్రసాద్‌ను గురువారం నాడు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

  
 

click me!