ప్రస్తుతం దేశవ్యాప్తంగా విసిపిస్తున్న పేరు సలార్. ఇవాళ దేశవ్యాప్తంగా విడుదలైన ఈ ప్రభాస్ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక తెలుగురాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు.
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సలార్ సందడి నెలకొంది. ఎన్నో అంచనాలతో ఇవాళ రిలీజైన సలార్ మూవీ చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్ ఎగబడ్డారు. తమ అభిమాన హీరో ప్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తూ కొందరు, థియేటర్ల ముందు టపాసులు కాలుస్తూ మరికొందరు అభిమానులు హల్ చల్ చేసారు. సాధారణ థియేటర్ల వద్దే ఇలాంటి పరిస్థితి వుంటే హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్డులో పరిస్ధితి ఇంకెలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. అక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు... ఇది తట్టుకోలేక పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన ఏర్పడింది.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందిన సలార్ పై ముందునుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో లోనే చూడాలని అభిమానులు కోరుకున్నారు. ఆన్ లైన్ లో టికెట్లు కొందామని అమ్మకానికి పెట్టిన మరునిమిషమే అమ్ముడుపోయాయి. దీంతో థియేటర్ల వద్ద ఏమైనా దొరుకుతాయేమోనని అభిమానులు ఆశించారు. ఇలా హైదరాబాద్ లోని ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్లకు నిలయమైన ఆర్టిసి క్రాస్ రోడ్ బాట పట్టారు.
ఇక సలార్ మూవీ ఫస్ట్ షో పడకముందే సంధ్య థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఇలా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా చూసేందుకు వచ్చినవారు, టికెట్లకోసం వచ్చినవారితో సంధ్య థియేటర్ కాదు ఆర్టిసి క్రాస్ రోడ్డు ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించిన థియేటర్ యాజమన్యం పోలీస్ బందోబస్తును ఏర్పాటుచేసుకుంది.
Also Read ఇంతకి `సలార్ 2` ఉంటుందా?.. ప్రశాంత్ నీల్ వెనక్కి తగ్గుతాడా?.. తాజా ఫలితంతో క్లారిటీ వచ్చినట్టే..
సినిమా మరికొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది అనగా టికెట్ల కోసం వచ్చిన అభిమానుల్లో అసహనం పెరిగిపోయింది. అప్పటివరకు పోలీసులకు సహకరించిన వారు ఒక్కసారిగా ఎదురుతిరిగారు. టికెట్ల కోసం థియేటర్ గేట్లు దూకి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేసారు. దీంతో పరిస్థితి అదుపుతప్పేలా కనిపించడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. థియేటర్ లోకి దూసుకెళ్ళిన అభిమానులపై లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు పోలీసులు.
ఇలా తమ అభిమాన నటుడి కోసం లాఠీదెబ్బలు తిన్నారు అభిమానులు. సినిమా మొదలయ్యే సమయానికి సంధ్య థియేటర్ ప్రాంగణమంతా అభిమానులు విసిరిన పేపర్లతో నిండిపోయింది. ప్రస్తుతం సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడంతో మళ్లీ ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ మొదలయ్యింది. థియేటర్ల వద్దకు మళ్లీ భారీగా చేరుకుంటున్న ఫ్యాన్స్ ఊర మాస్ సంబరాలు జరుపుకుంటున్నారు.