ఏ పార్టీలో చేరేది రెండు మూడు రోజుల్లో చెబుతా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

By narsimha lode  |  First Published Jun 9, 2023, 11:24 AM IST

ఏ పార్టీలో  చేరే విషయాన్ని   హైద్రాబాద్ లో రెండు మూడు రోజుల్లో  ప్రకటిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు. 


ఖమ్మం: ఏ పార్టీలో  చేరే విషయమై  రెండు మూడు రోజుల్లో  నిర్ణయం ప్రకటించనున్నట్టుగా  మాజీ ఎంపీ పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు. శుక్రవారంనాడు  ఉదయం  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖమ్మంలోని  ఓ ఫంక్షన్ హల్ లో   సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  మాట్లాడారు.  తన భవిష్యత్తు  కార్యాచరణపై   ప్రకటన విషయమై  ఎక్కువ సమయం తీసుకోని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ప్రకటించారు. ఏ పార్టీలో  చేరేది , ఏ తేదీన చేరేది హైద్రాబాద్ లో  ప్రకటించనున్నట్టుగా  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  తెలిపారు.   ఖమ్మంలో  భారీ సభ నిర్వహించి  ఆ పార్టీలో  చేరుతానన్నారు.  

తన చిరునవ్వే నీ రాజకీయ సమాధికి నాంది పలుకుతుందని  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు  మాజీ ఎంపీ  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
నీ అవాకులు చవాకులకు సమాధానం చెబుతానన్నారు.

Latest Videos

నందమూరి  విగ్రహనికి పూలమాలవేస్తే    పాలాభిషేకం చేయిస్తావా  అని  ఆయన  ఆగ్రహం వ్యక్తం  చేశారు.  ఇదేనా మీ సంస్కృతి అని  ఆయన అడిగారు. తన టార్గెట్  బీఆర్ఎస్ అని  ఆయన ప్రకటించారు.   తమను ఇబ్బంది పెట్టిన 

తాను ఓ పార్టీలో  చేరుతానని  బీఆర్ఎస్ నాయకులు ఊహించారన్నారు. కానీ తాను వ్యూహం  మార్చడంతో బీఆర్ఎస్ నేతలకు దిక్కు తోచడం లేదని  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  చెప్పారు. 

also read:రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

ఈ ఏడాది  ఏప్రిల్ 9వ తేదీన   బీఆర్ఎస్ నాయకత్వం   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో  కాంగ్రెస్, బీజేపీల నేతలు   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,  జూపల్లి కృష్ణారావులతో చర్చించారు. అయితే  బీజేపీ కంటే  కాంగ్రెస్ వైపే  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు  మొగ్గు చూపుతున్నారని సమాచారం.  ఈ తరుణంలోనే  ఇవాళ  ముఖ్యమైన అనుచరులతో  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి   సమావేశం  నిర్వహించారు. 


 

click me!