సైదాబాద్ హత్యాచారం: రాజు అంత్యక్రియలు పూర్తి.. వరంగల్‌లోనే నిర్వహించిన కుటుంబసభ్యులు

Siva Kodati |  
Published : Sep 16, 2021, 08:42 PM ISTUpdated : Sep 16, 2021, 08:47 PM IST
సైదాబాద్ హత్యాచారం:  రాజు అంత్యక్రియలు పూర్తి.. వరంగల్‌లోనే నిర్వహించిన కుటుంబసభ్యులు

సారాంశం

సైదాబాద్ అత్యాచారం, హత్య కేసు నిందితుడు రాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు మట్టెవాడ పోలీసులు. అంత్యక్రియల నిర్వహణపై కుటుంబసభ్యులతో చర్చించారు రైల్వే పోలీసులు

సైదాబాద్ అత్యాచారం, హత్య కేసు నిందితుడు రాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు మట్టెవాడ పోలీసులు. అంత్యక్రియల నిర్వహణపై కుటుంబసభ్యులతో చర్చించారు రైల్వే పోలీసులు. ఆపై వరంగల్‌లోని పోతన స్మశాన వాటికలలోనే రాజు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబసభ్యులు

త్యాచారం కేసు నిందితుడు రాజు ఆత్మహత్య వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే అతను ఆత్మహత్య చేసుకోవడానికి ముందు చూసిన రైల్వే కీమెన్లు రాజును ఆపేందుకు ప్రయత్నించారు. అతను ట్రాక్‌పై నడుస్తున్న సమయంలో చూశామని.. కానీ రాజు తమను చూసి పొదల్లోకి వెళ్లి దాక్కున్నాడని రైల్వే కీమెన్లు పేర్కొన్నారు. రాజును బయటకు రప్పించేందుకు ప్రయత్నించామని... ముళ్ల పొదల్లోకి రాళ్లు రువ్వామని వారు తెలిపారు. 10 నిమిషాలు అక్కడే వుండి వెయిట్ చేశామని.. రాజు బయటకు రాకపోవడంతో ట్రాక్ పనుల్లో మునిగిపోయామని రైల్వే కీమెన్లు స్పష్టం చేశారు.

Also Read:పోలీసులే చంపారు: సైదాబాద్ ఘటన నిందితుడు రాజు తల్లి అనుమానం

10 నిమిషాల తర్వాత రాజు ఆత్మహత్య చేసుకున్నాడని రైతులు కాల్ చేశారని వారు తెలిపారు. అనంతరం వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. అదే సమయంలో రైలుకు ఎదురుగా వెళ్తున్న రాజును తాము చేశామని రైతులు వెల్లడించారు. తాము అతనిని ఆపేందుకు ప్రయత్నించామని ... బ్రిడ్జి కింద నుంచి తాము అరుస్తూ ట్రాక్ పైకి వెళ్లామని తెలిపారు. మాకు కొంత దూరంలో వుండగానే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్‌కి ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నారని రైతులు పేర్కొన్నారు. సమాచారం వెంటనే రైల్వే కీమెన్లకు చెప్పామని వెల్లడించారు. రాజు వద్ద రెండు జియో సెల్‌ఫోన్లు, ఇంటికీ, పది రూపాయలు దొరికాయన్నారు. చేతులపై వున్న మౌనిక అన్న పేరు చూసి రాజుగా గుర్తించామన్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu