24 గంటల్లో 259 మందికి పాజిటివ్, తెలంగాణలో 6,62,785కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Sep 16, 2021, 08:17 PM IST
24 గంటల్లో 259 మందికి పాజిటివ్, తెలంగాణలో 6,62,785కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

తెలంగాణలో కొత్తగా 259 కరోనా కేసులు నమోదవ్వగా.. ఒకరు మృతి చెందారు. 301 మంది వైరస్ నుంచి కోలుకోగా.. తెలంగాణలో ప్రస్తుతం 5,282 యాక్టివ్‌ కేసులు వున్నాయి.

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 58,261 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 259 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 6,62,785కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణలో 3,900 మంది కొవిడ్‌కు బలయ్యారు. ఒక్కరోజు వ్యవధిలో 301 మంది కరోనా నుంచి కోలుకోవడంతో రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,53,603కి చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 5,282 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.  

ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 8, జీహెచ్ఎంసీ 72, జగిత్యాల 9, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 0, గద్వాల 0, కామారెడ్డి 1, కరీంనగర్ 11, ఖమ్మం 22, మహబూబ్‌నగర్ 2, ఆసిఫాబాద్ 1, మహబూబాబాద్ 6, మంచిర్యాల 6, మెదక్ 1, మేడ్చల్ మల్కాజిగిరి 13, ములుగు 0, నాగర్ కర్నూల్ 1, నల్గగొండ 11, నారాయణపేట 1, నిర్మల్ 1, నిజామాబాద్ 2 , పెద్దపల్లి 9, సిరిసిల్ల 7, రంగారెడ్డి 15, సిద్దిపేట 6, సంగారెడ్డి 4, సూర్యాపేట 6, వికారాబాద్ 0, వనపర్తి 2, వరంగల్ రూరల్ 8, వరంగల్ అర్బన్ 16, యాదాద్రి భువనగిరిలో 7 చొప్పున కేసులు నమోదయ్యాయి.


 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్