డెడ్‌బాడీని మాకు చూపాలి, అతను రాజో కాదో గుర్తిస్తాం: సైదాబాద్ ఘటనలో హత్యకు గురైన బాలిక తండ్రి

Published : Sep 16, 2021, 11:46 AM IST
డెడ్‌బాడీని మాకు చూపాలి, అతను రాజో కాదో గుర్తిస్తాం: సైదాబాద్ ఘటనలో హత్యకు గురైన బాలిక తండ్రి

సారాంశం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైల్వేట్రాక్ పై ఉన్న మృతదేహం రాజుదో కాదో  తెలియాలంటే తమకు చూపించాలని మైనర్ బాలిక తండ్రి మీడియాకు చెప్పారు. ారం రోజుల తర్వాత రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటనపై విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

హైదరాబాద్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైల్వే ట్రాక్ పై ఉన్న మృతదేహం రాజుదో కాదో తెలియాలంటే తమకు చూపించాలని  హత్యకు గురైన మైనర్ బాలిక తండ్రి  మీడియాకు చెప్పారు.రాజు స్టేషన్ ఘన్ పూర్ రైల్వేట్రాక్ పై ఆత్మహత్య చేసుకొన్నట్టుగా మీడియాలో వచ్చిన వార్తలకు ఆయన గురువారం నాడు  స్పందించారు. రాజు అనే పేరుతో చాలా మంది ఉంటారని అదే విధంగా మౌనిక అనే పేరు కూడ చాలా మందికి ఉంటుందన్నారు.

also read:సైదాబాద్‌‌లో ఆరేళ్ల బాలికపై రేప్, హత్య కేసు నిందితుడు ఆత్మహత్య: నిర్ధారించిన కేటీఆర్

నిజంగా ఆత్మహత్య చేసుకొంది  రాజు అవునా కాదా అనే విషయాన్ని తాము ఆ డెడ్ బాడీని చూస్తే తాము గుర్తిస్తామన్నారు. పోలీసులు చెబుతున్న డెడ్‌బాడీని సింగరేణి కాలనీకి తీసుకురావాలని ఆయన కోరారు.డెడ్‌బాడీ చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా రాజు ఆత్మహత్య చేసుకొన్నట్టుగా పోలీసులు ప్రకటించారు. స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే స్టేషన్ కు సమీపంలోని రాజారాం వద్ద రాజు డెడ్‌బాడీని గుర్తించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu