రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

By narsimha lodeFirst Published Oct 3, 2022, 10:28 PM IST
Highlights

రాష్ట్ర  వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు.  ఎల్ బీ స్టేడియం నుండి ట్యాంక్ బండ్ వరకు మహిళలు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. 

హైదరాబాద్:రాష్ట్రంలో  సద్దుల బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు మహిళలు.ఇవాళ హైద్రాబాద్ లోని  ఎల్ బీ స్టేడియంలో  సద్దుల బతుకమ్మ వేడుకలు  జరిగాయి. రాస్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుండి  ట్యాంక్ బండ్ వరకు బతుకమ్మలతో మహిళలు ర్యాలీ నిర్వహించారు. బతుకమ్మలను పురస్కరించుకొని ట్యాంక్ బండ్  వద్ద లేజర్ షో ఆకట్టుకుంది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో  మంత్రులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు ఆయా పార్టీల నేతలు కూడా పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బతుకమ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ నిర్శహనకు ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. గతనెల 25 నుండి ఇవాళ్టి వరకు బతుకమ్మ ఉత్సవాల కోసం ప్రభుత్వం రాస్ట్రంలో విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. గత రెండేళ్లుగా కరోనా ప్రభావం బతుకమ్మ ఉత్సవాలపై పడింది. అయితే కరోనా ప్రభావం తగ్గడంతో ఈ ఏడాది బతుకమ్మ ఉత్సవాలను  ఘనంగా నిర్వహించింది ప్రభుత్వం. సిద్దిపేట జిల్లాలో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. 

click me!