విషాదం: యూరియా కోసం క్యూలైన్లో నిలబడ్డ రైతు మృతి

By Nagaraju penumalaFirst Published Sep 5, 2019, 4:42 PM IST
Highlights

సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డు వద్ద యూరియా కోసం రైతు ఎల్లయ్య లైన్ లో నిలబడ్డాడు. యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్న ఎల్లయ్యకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం అక్కడ నుంచి ఆస్పత్రి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు రైతు ఎల్లయ్య. 

సిద్ధిపేట: తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత రైతుల ప్రాణాలమీదకు తెస్తోంది. యూరియా కోసం గంటల తరబడి క్యూలో నిలబడలేక ఓ వృద్ధ రైతు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి నెలకొంది. 

సిద్దిపేట జిల్లా దుబ్బాక మార్కెట్ యార్డు వద్ద యూరియా కోసం రైతు ఎల్లయ్య లైన్ లో నిలబడ్డాడు. యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్న ఎల్లయ్యకు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. 

అనంతరం అక్కడ నుంచి ఆస్పత్రి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు రైతు ఎల్లయ్య. రైతు ఎల్లయ్య మృతిపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. 

రైతు ఎల్లయ్య మృతి ప్రభుత్వ హత్యేనంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.....రైతు మృతికి యూరియా కొరతకు ఎలాంటి సంబంధం లేదని టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇకపోతే యూరియా కోసం తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

యూరియా కోసం మాచారెడ్డిలో రైతన్న రోడ్డెక్కాడు. ఎన్నిసార్లు వచ్చినా స్టాక్‌ లేదంటూ సింగిల్‌విండో సిబ్బంది చేతులెత్తేయడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

యూరియా కోసం క్యూలో నిలబడ్డ రైతు మృతి: ప్రభుత్వ హత్య అంటూ కాంగ్రెస్ మండిపాటు

click me!