Rythu Bandhu: రైతుల‌కు శుభ‌వార్త‌.. ప‌దిరోజుల్లో ఖాతాల్లో రైతుబంధు జమా!

By team teluguFirst Published Dec 5, 2021, 6:00 PM IST
Highlights

తెలంగాణ రైతుల‌కు సీఎం కేసీఆర్ శుభ‌వార్త చెప్పారు. వారం, ప‌ది రోజుల్లో యాసాంగి రైతు బంధు సాయం అందించాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన‌ట్టు తెలుస్తుంది. అలాగే.. పంటల ప్రణాళికలను సిద్దం చేయాల‌ని  సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలిస్తారని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.  
 

Rythu Bandhu: తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే.. యాసంగి సాగు ప్రారంభం అవుతోంది. ఈ త‌రుణంలో రైతుబంధు నిధులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారట‌ సీఎం కేసీఆర్. ఎకరానికి 5 వేల చొప్పున సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు ఏకంగా 7,500 కోట్ల రూపాయల‌ను రైతు బంధుగా అందించ‌నున్న‌ర‌ట‌.  

ఈ రెండు వారాల్లోగా  యాసంగిలో సాగు చేయాల్సిన పంటల ప్రణాళికతో పాటు, రైతుబంధు నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. యాసంగి రైతు బంధు సాయాన్ని పదిరోజుల్లో విడుద‌ల చేయాల‌ని టీ సర్కార్ నిర్ణ‌యించింద‌ట‌. వ‌చ్చే వారం, ప‌ది రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించార‌ట‌. సీఎం ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థికశాఖ దృష్టి సారించింది. 

Read Also: https://telugu.asianetnews.com/telangana/trs-eventually-became-the-culprit-in-wadla-s-purchases-r3n1n3

నిన్న టీఆర్ఎస్ ఎంపీలతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గుర్తు చేసినట్లు సమాచారం అందుతోంది. అలాగే టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర రైతుల తరపున తమ గొంతును గట్టిగా వినిపించాలని చెప్పారట‌ సీఎం కేసీఆర్.
 
మరోవైపు, గత రెండు నెలలో తెలంగాణ‌లో వేల కోట్ల వ్యాపారం జరగ‌గా..కోట్లాది రూపాయాల్లో జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. అలాగే..  అబ్కారీ శాఖ టెండ‌ర్ల‌తో కోట్లాది రూపాయాలు రాష్ట్ర ఖ‌జానాలో చేరిన‌ట్టు తెలుస్తోంది. దీంతో నిధుల సర్ధుబాటులో ఎలాంటి స‌మ‌స్య ఉండ‌వ‌నీ రాష్ట్ర ఆర్థిక శాఖ సైతం సీఎం కేసీఆర్‌కు నివేదించింద‌ట‌.

Read Also: https://telugu.asianetnews.com/telangana/farmers-of-telugu-states-who-are-struggling-with-debt-the-central-government-has-revealed-the-details-r3lcfk

వ్యవసాయ శాఖ నివేదికల ప్ర‌కారం.. రాష్ట్రంలో 7,19,105 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. యాసంగిలో కూడా  6.03 లక్షల ఎకరాల్లో సాగు చేయెచ్చున‌ని అంచ‌నా. అయితే .. తెలంగాణ రైతాంగంలో వరి సాగుపై సందిగ్ధత ఉండటంతో సాగు చేయ‌డానికి వెనకడుతున్న‌ట్టు తెలుస్తోంది. 

ఖ‌రీఫ్ లో సాధారణ సాగు 11 వేల ఎకరాలు ఉండగా.. ప్రస్తుతానికి కేవలం 745 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారు. అయితే ఈసారి మొక్కజొన్న, వేరుశనగ కూడా సాధారణ సాగు విస్తీర్ణాన్ని దాటిపోయింది. ఇటు మినుముల సాగు కూడా పెరిగింది. యాసంగిలో మినుములు సాధారణ సాగు 24 వేల ఎకరాలు ఉండగా.. ఈ నెల 25 నాటికి నివేదికల ప్రకారం 53,612 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

Read Also: https://telugu.asianetnews.com/telangana/telangana-cm-kcr-review-on-paddy-procurement-r3laq7

రీప్ సీజన్ లో 60.84 లక్షల మంది రైతులకు  రూ.7,360.41 కోట్లను రైతుబంధు సాయంగా అందించింది రాష్ట్ర ప్ర‌భుత్వం. అయితే.. యాసంగి సీజన్‌లో రైతుబంధు సాయం బ‌డ్జెట్ మ‌రింత పెరుగ‌నున్న‌ది. కొత్తగా పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూవిస్తీర్ణం పెరిగితే బడ్జెట్‌ కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే సుమారు కోటిన్నర లక్షల ఎకరాలకు పంపిణీ చేయడానికి రూ.7,500 కోట్లు అవసరమ‌ని తెలుస్తోంది.
 
ఈ రైతు బంధు సాయం తొలుత ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి.. ఇలా ఆరోహణ పద్ధతిలో నగదు బదిలీ చేస్తారు. ఈసారి కూడా అదే పద్ధతిలో పంపిణీ చేసేందుకు అధికారులులు సిద్ధమవుతున్నార‌ని తెలుస్తోంది. 
 

click me!