రైతులకు తపాలా శాఖ శుభవార్త.. ఇకపై పోస్టాఫీసుల్లోనూ రైతు బంధు, ఇలా చేస్తే చాలు

Siva Kodati |  
Published : Jun 18, 2021, 06:04 PM IST
రైతులకు తపాలా శాఖ శుభవార్త.. ఇకపై పోస్టాఫీసుల్లోనూ రైతు బంధు, ఇలా చేస్తే చాలు

సారాంశం

రైతులకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై పోస్టాఫీసుల్లోనూ రైతుబంధు డబ్బులు తీసుకునే సౌలభ్యాన్ని కల్పించినట్లు తపాల శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ శుక్రవారం వెల్లడించారు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా రైతుబంధు సొమ్ము తీసుకోవచ్చని ఆయన తెలిపారు

రైతులకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై పోస్టాఫీసుల్లోనూ రైతుబంధు డబ్బులు తీసుకునే సౌలభ్యాన్ని కల్పించినట్లు తపాల శాఖ సహాయ సంచాలకులు శ్రీనివాస్ శుక్రవారం వెల్లడించారు. ఎలాంటి అదనపు రుసుం లేకుండా రైతుబంధు సొమ్ము తీసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా 5,794 తపాలా కార్యాలయాల్లో మైక్రో ఏటీఎంలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు శ్రీనివాస్ తెలిపారు.

Also Read:రైతుబంధుకు 7వేల కోట్లు, రుణమాఫీకి 12వందల కోట్లు.. హరీష్ రావు..

ఆధార్‌తో లింక్‌ అయి ఉన్న ఏ బ్యాంకు ఖాతా కలిగి ఉన్నా మైక్రో ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవచ్చని వెల్లడించారు. రైతులు ఆధార్ కార్డుతో పాటు ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్‌ను తీసుకెళ్తే సరిపోతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. మైక్రో ఏటీఎంలో వేలిముద్ర సాయంతో రోజుకు రూ.10 వేలు నగదు తీసుకోవచ్చని తెలిపారు. రబీ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 1.73 లక్షల మంది రైతులకు రూ. 169 కోట్ల రైతుబంధు నగదును అందజేసినట్లు శ్రీనివాస్‌ వివరించారు.  

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు