ఈటల భూకబ్జా ఆరోపణలు: రెగ్యులరైజ్ కోసం ఒత్తిడి తెచ్చారు.. రిటైర్డ్ కలెక్టర్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Apr 30, 2021, 6:40 PM IST
Highlights

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వస్తున్న భూకబ్జా ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి అధికారి ధర్మారెడ్డి స్పందించారు. అప్పట్లోనే మంత్రి అభ్యర్ధనను తాను తిరస్కరించానని ఆయన తెలిపారు.

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వస్తున్న భూకబ్జా ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి అధికారి ధర్మారెడ్డి స్పందించారు. అప్పట్లోనే మంత్రి అభ్యర్ధనను తాను తిరస్కరించానని ఆయన తెలిపారు.

అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయాలని ఈటల సంప్రదించారని రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి వెల్లడించారు. అయితే చట్ట ప్రకారం ఈ భూమి రెగ్యులరైజ్ కాదని మంత్రికి చెప్పానని ఆయన పేర్కొన్నారు.

వంద ఎకరాల్లో కోళ్ల ఫారాలు వున్నాయని .. డబ్బు చెల్లించి రెగ్యులరైజ్ చేయమని అడిగారని ధర్మారెడ్డి చెప్పారు. అచ్చంపేట వద్ద కోళ్ల ఫారాలు వున్నాయని ఆయన తెలిపారు. కలెక్టర్ స్థాయిలో అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయడం సాధ్యం కాదని చెప్పినట్లు ధర్మారెడ్డి పేర్కొన్నారు. అన్ని ఆధారాలు వుంటే భూమి లేని నిరునపేదలకు అసైన్డ్ భూమిని రెగ్యులరైజ్ చేయవచ్చని ధర్మారెడ్డి పేర్కొన్నారు. 

Also Read:భూకబ్జా ఆరోపణలు: ఈటెల రాజేందర్ మీద కేసీఆర్ సీరియస్?

అడిషనల్ కలెక్టర్ నగేశ్ మాట్లాడుతూ.. ఆ 25 ఎకరాల భూమిని ఇవ్వాలని ఈటల సంప్రదించినట్లు చెప్పారు. తాను క్షేత్ర స్థాయికి వెళ్లి భూమిని పరిశీలించానని గుర్తుచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు.. అసైన్డ్ వ్యక్తులకు, అసైన్డ్ ల్యాండ్ ఇవ్వడం కుదరదని నగేశ్ చెప్పారు.

ప్రస్తుతం ఆ భూమి ఈటల ఆధీనంలో వుందని అడిషనల్ కలెక్టర్ తెలిపారు. వాస్తవానికి ఆ భూములు బలహీనవర్గాల వారివన్నారు. ఈ విషయంలో తానేమీ చేయలేనని మంత్రికి చెప్పానని నగేశ్ పేర్కొన్నారు. పలు మార్లు ల్యాడ్ ఇవ్వాలని ఈటల ఒత్తిడి తెచ్చారని... జమున హ్యాచరీస్ పక్కన 25 ఎకరాల భూమి వుందని నగేశ్ తెలిపారు. 

click me!