
తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాలకు పాల్పడినట్లుగా తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీటి ప్రకారం.. అసైన్డ్ భూములపై కన్నేసిన ఆయన మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని జమున హ్యాచరీస్ కోసం పేదలను బెదిరించినట్లుగా ఛానెల్స్ చెబుతున్నాయి.
మా భూములు కాజేశారని.. ఆ ప్రాంతంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతులు ఆరోపిస్తున్నారు. అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో సుమారు 100 ఎకరాలను ఈటల రాజేందర్ కబ్జా చేశారని వార్తలు వస్తున్నాయి.
130/5, 130/9. 130/10, 64/6 సర్వే నెంబర్లలో ఈటల దౌర్జన్యం చేశారని తెలుస్తోంది. మంత్రితో పాటు ఆయన అనుచరులు సూరి, యంజాల సుధాకర్ రెడ్డిలపై రైతులు, భూ యజమానులు ఫిర్యాదు చేశారు.
ఈటల భార్య జమున, కొడుకు నితిన్ రెడ్డి పేరుతో అసైన్డ్ భూములను కొనుగోలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ కుదరదన్నా అధికారులపై మంత్రి ఈటల ఒత్తిడి తీసుకొచ్చారని చెబుతున్నారు. ఓ పౌల్ట్రీఫాం నిర్మాణం కోసం 100 ఎకరాల దందా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
తమ భూములు లాక్కున్నారని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు ఆరోపణలు చేస్తున్నారు ఆసైన్డ్ భూములను కొంత మంది అమ్ముకున్నారని చెబుతున్నారు అసైన్డ్ భూములపై మంత్రి ఈటెల రాజేందర్ కన్నేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. జమున హ్యాచరీస్ కోసం పేదలను బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు అధికారులకు రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
రిజిస్ట్రేషన్ కుదరదని చెప్పినా అధికారులపై మంత్రి ఒత్తిడి తెచ్చారని ఆరోపిస్తున్నారు. తమ భూములను కబ్జా చేసిన విషయాన్ని రైతులు ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. రేటు నిర్ణయించి ఆ రేటుకే భూమిని తీసుకున్నారని చెప్పారు. రైతులు భూమి విక్రయించి, ఇప్పుడు తిరిగి ఇవ్వాలని కోరుతున్నట్లు రైతుల మాటలను బట్టి అర్థమవుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు, ఇతర ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు. తాము విక్రయించలేదని, బలవంతంగా తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. భయపడి భూములు ఇచ్చామని అంటున్నారు. వ్యవహారమంతా సూరి అనే వ్యక్తి నడిపించాడని, మంత్రి ఈటెల రాజేందర్ పేరు చెప్పి సూరి వ్యవహారం నడిపారని రైతులు చెబుతున్నారు.