భూకబ్జా ఆరోపణలు: ఈటెల రాజేందర్ మీద కేసీఆర్ సీరియస్?

By telugu teamFirst Published Apr 30, 2021, 6:27 PM IST
Highlights

మంత్రి ఈటెల రాజేందర్, ఆయన అనుచురులు అసైన్డ్ భూములను తీసుకోవడంపై సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ భూముల గురించి అప్పటి మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నగేష్ వివరణ ఇచ్చారు.

హైదరాబాద్: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తమ భూములను మంత్రి ఈటెల రాజేందర్ మీద, ఆయన అనుచరుల మీద ఆరోపణలు చేస్తూ బాధిత రైతులు కేసీఆర్ కు లేఖ రాశారు. ఈటెల రాజేందర్ మీదనే ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. రెండు టీవీ చానెళ్లలో ఇందుకు సంబంధించి విస్తృతమైన వార్తాకథనాలు ప్రసారమవుతున్నాయి. 

ప్రముఖ తెలుగు టీవీ చానెల్ 10టీవీ భూముల ఆక్రమణ సమయంలో మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన నగేష్ తో మాట్లాడింది. అందుకు సంబంధించి నగేష్ తన అభిప్రాయాలను వెల్లడించారు. తమ హేచరీస్ పక్కన ఉన్న అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేయాలని మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారని, వాటిని రెగ్యులరైజ్ చేస్తే తమకు మేలు జరుగుతుందని చెప్పారని నగేష్ చెప్పారు. 

తాము ఫీల్డ్ సర్వే చేసి వాటిని రెగ్యులరైజ్ చేయడం కుదరదని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈటెలతో పాటు ఆయన అనుచరులపై తమపై ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు 20 ఎకరాల వరకు అసైన్డ్ భూములు తీసుకున్నారని ఆయన చెప్పారు. భూములు ప్రస్తుతం రైతుల ఆధీనంలో లేవని ఆయన చెప్పారు. వాటిని తిరిగి తీసుకుని సంబంధిత అధికారులు అసైనీలకు తిరిగి అప్పగించాలని ఆయన అన్నారు. 

అసైన్డ్ భూములు తీసుకున్నందుకు క్రిమినల్ కేసులు కూడా పెట్టవచ్చునని ఆయన చెప్పారు. అయితే రైతులు డబ్బులు తీసుకుని అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే, భూములు ఇప్పటికీ రైతుల పేర్ల మీదనే ఉన్నాయని, కొన్నవాళ్ల పేర్ల మీదికి మారలేదని ఆయన చెప్పారు. 

తాము చట్టం గురించి స్పష్టంగా చెప్పామని ఆయన అన్నారు. అవసరమైతే పోలీసుల సాయం తీసుకుని తాహిసిల్దార్ తిరిగి ఆ భూములను స్వాధీనం చేసుకుని అసైనీలకు అప్పగించాలని ఆయన అన్నారు  చుట్టుపక్కల భూములకు వెళ్లడానికి వీలు లేకుండా దారులు మూసేశారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. 

click me!