ఐదు లక్షలతో సకల జనుల సమర భేరీ: ఆర్టీసీ జేఎసీ నిర్ణయాలివే

Published : Oct 20, 2019, 04:28 PM ISTUpdated : Oct 20, 2019, 06:14 PM IST
ఐదు లక్షలతో సకల జనుల సమర భేరీ:  ఆర్టీసీ జేఎసీ నిర్ణయాలివే

సారాంశం

ఆర్టీసీ జేఎసీ నేతలు భవిష్యత్తు కార్యాచరణను ఆదివారం నాడు ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు  కార్యాచరణను ప్రకటించారుఆర్టీసీ జేఎసీ నేతలు రాజకీయ పార్టీలతో ఆదివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  సమావేశమయ్యారు.అక్టోబర్ 30వ తేదీన ఐదు లక్షలతో  సకల జనుల సమర భేరీని నిర్వహించాలని డిసైడ్ చేశారు. 


హైదరాబాద్: ఈ నెల 30వ తేదీన ఐదు లక్షల మందితో సకల జనులతో సమరభేరిని నిర్వహించాలని ఆర్టీసీ జేఎసీ నిర్ణయం తీసుకొంది. ఆర్టీసీ జేఎసీ నేతలు రాజకీయ పార్టీలతో ఆదివారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో  సమావేశమయ్యారు.

RTC Strike:కేసీఆర్‌తో పువ్వాడ, సునీల్ శర్మ భేటీ, హైకోర్టు ఆదేశాలపై చర్చ

ఈ సమావేశంలో ఆర్టీసీ జేఎసీ నేతలు ఆశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలు ఆదివారం నాడు సుందరయ్య  విజ్ఞాన కేంద్రంలో  సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా భవిష్యత్తులో నిర్వహించతలపెట్టిన కార్యక్రమాలపై చర్చించారు.

హాట్ టాపిక్ ఆర్టీసీ సమ్మె: మెట్టు దిగని కేసీఆర్, పట్టువీడని కార్మికులు

ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు  కార్యాచరణను ప్రకటించారు ఆర్టీసీ జేఎసీ, రాజకీయ పార్టీలు. ఈ మేరకు ఆదివారం నాడు ఆర్టీసీ జేఎసీ నేతలు, రాజకీయ పార్టీల నేతలు  సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.

ఈ నెల 21వ తేదీన ఆర్టీసీ కుటుంబసభ్యులతో కలిసి బస్ డిపోల ముందు బైఠాయించాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ నెల 22న తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నవారిని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు.దీనికితోడు తమ సమ్మెకు మద్దతుగా అన్ని పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులను కలిసి ఈ నెల 23న విన్నవించాలని ఈ సమావేశంలో డిసైడ్ అయ్యారు.

RTC Strike:నల్గొండలో ఏడీసీ మల్లయ్య మృతి

ఈ నెల 25న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విపక్షాలు, ఆర్టీసీ జేఎసీ నేతలు జాతీయ రహదారులపై రాస్తారోకోలు నిర్వహించాలని  నిర్ణయం తీసుకొన్నారు.ఈ నెల 26న ప్రభుత్వంమనసు మారాలని కోరుతూ ఆర్టీసీ కార్మికుల పిల్లలతో దీక్ష చేయాలని జేఎసీ నేతలు నిర్ణయించారు.

అక్టోబర్ 27న పండగ సందర్భంగా జీతాలు లేని కారణంగా పండగ చేసుకోకుండా నిరసన వ్యక్తం చేయాలని భావిస్తున్నారు.ఈ నెల 28న కోర్టు కేసు ఉంది. హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ ఉన్నందున  ఆ రోజున ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునివ్వలేదు.

హాట్ టాపిక్ ఆర్టీసీ సమ్మె: మెట్టు దిగని కేసీఆర్, పట్టువీడని కార్మికులు

ఈ నెల 30వ తేదీన ఐదు లక్షల మందితో సకల జనుల సమరభేరిని నిర్వహించాలని తలపెట్టారు.ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ఈ నెల 18వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, హైకోర్టు కాపీ అందలేదని ప్రభుత్వం ప్రకటిస్తోంది.

ఈ నెల 20వ తేదీన హైకోర్టు కాపీ ప్రభుత్వానికి అందింది. దీంతో హైకోర్టు ఆదేశాలపై ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ తో రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రవాణ శాఖ కార్యదర్శి సునీల్ శర్మలు ఆదివారం నాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. 

 

PREV
click me!

Recommended Stories

BRS Boycotts Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదుట బిఆర్ఎస్ నాయకుల నిరసన| Asianet News Telugu
Kavitha Pressmeet: నా రక్తం ఉడుకుతోంది KCRపై CMరేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కవిత | Asianet News Telugu