RTC Strike: తెలంగాణ ఆర్టీసీలో కర్ణాటక మోడల్?

By telugu teamFirst Published Nov 2, 2019, 9:04 AM IST
Highlights

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కెసిఆర్ ఈ రోజు క్యాబినెట్ భేటీ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో కేసీఆర్ ఆర్టీసీ సమస్య పరిష్కరించడానికి కర్ణాటక మోడల్ ను తెలంగాణాలో కూడా అమలు చేసేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్షించడానికి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి నేటి మధ్యాహ్నం మూడు గంటలకు కాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో ఆర్టీసీపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైకోర్టు కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసిన పరిస్థితుల్లో ఈ కాబినెట్ భేటీ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. 

తెలంగాణ ఆర్టీసీ ప్రస్తుతానికి ఒకటే సంస్థగా ఉంది. ఇలా కాకుండా కర్ణాటక మోడల్ ను అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. కర్ణాటకలో ప్రస్తుతానికి ఆర్టీసీని బెంగళూరు మెట్రో పోలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఈశాన్య రోడ్డు రవాణా సంస్థ, వాయువ్య రోడ్డు రవాణా సంస్థగా విభజించారు. 

Also read: RTC Strike:ముంబై ఫార్మూలాకు జీహెచ్ఎంసీ టోకరా

ఇదే తరహాలో తెలంగాణ ఆర్టీసీని కూడా హైదరాబాద్ మహానగరానికి ఒకటి, జిల్లాలకు రెండు కప్[ఒరేషన్లు గా విభజించనున్నట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఈ కాబినెట్ సమావేశంలో అద్దె బస్సులను పెంచాలనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి అద్దె బస్సులు 25 శాతానికి మించకూడదన్న నిబంధన ఉంది. దీన్ని సవరించి 30 శాతం మేర అద్దె బస్సులను తీసుకొచ్చేందుకు సర్కార్ యోచిస్తోందని తెలియవస్తుంది. 

ప్రైవేట్ బస్సులకు కూడా పేర్మిట్లిచ్చేందుకు ఇప్పటికే అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం మనకు తెలిసిందే. కేంద్రం నూతనంగా చేసిన మోటార్ వాహన చట్టాన్ని ఉపయోగించుకొని 3 నుంచి 4 వేల ప్రైవేట్ బస్సులకు పేర్మిట్లిచ్చే అంశంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం 1,035 అద్దె బస్సులకు టెండర్లను ఆహ్వానించినా విషయం తెలిసిందే. 

Also read: RTC Strike: మెట్రోకు క్రాస్ సబ్సిడీ, ఆర్టీసీ ఏం చేసింది?

ప్రైవేట్ వుపేటర్లకు గనుక పేర్మిట్లు ఇస్తే వారు కేవలం లాభాలొచ్చే రూట్లలోనే నడుపుతారు కాబట్టి, కేవలం ఒక్క రూట్లోనే కాకుండా 2 నుంచి 3 రూట్లకు కలిపి పేర్మిట్లు జారీ చేస్తే మంచిదనే విషయం అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. కాబినెట్ భేటీలో ఈ విషయంపై కూడా చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

కేవలం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మాత్రమే కాకుండా శాశ్వత పరిష్కారాలకోసం ప్రణాలికను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలియవస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో అమలవుతోన్న పద్దతుల ఆధారంగా నూతన విధానం ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్టు సమాచారం. 

Also read: RTC Strike: అర్టీసీకి కేసీఆర్ మంగళం, మధ్యప్రదేశ్ మోడల్

హైద్రాబాద్‌ నగరంలో ఆర్టీసీకి వస్తున్న నష్టాలను పూడ్చేందుకు గతంలో ముంబై ఫార్మూలాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెరమీదికి తీసుకొచ్చింది. అయితే ఈ ముంబై ఫార్మూలా మాత్రం  ఆచరణలో అమలు కాలేదు. రెండేళ్లు మాత్రమే జీహెచ్ఎంసీ ఆర్టీసీకి నిధులు ఇచ్చినట్టుగా అధికారికంగా  ఆర్టీసీ యాజమాన్యం నిన్న కోర్టుకు చెప్పింది. 

click me!