నిండు గర్భిణి... ఇద్దరు ప్రియులతో కలిసి... భర్తను అతి కిరాతకంగా....

By telugu team  |  First Published Nov 2, 2019, 8:27 AM IST

పావని భర్తతో ఉంటూనే తన పాత పరిచయస్తుడు దవాతే దౌలాజీ అలియాస్‌ రమేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దౌలాజీ సైతం అంకాపూర్‌లోనే కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ సమయంలోనే తన భర్త ఉదయ్‌కుమార్‌ స్నేహితుడైన గంగాధర్‌తోనూ పావనికి పరిచయం ఏర్పడింది. 


పెళ్లై.. భర్త ఉన్నాడు. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణీ కూడా. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండాల్సిన ఆమె తాను కట్టుకున్న భర్తను కడతేర్చింది. అది కూడా ఇద్దరు ప్రియులతో కలిసి దారుణానికి ఒడిగట్టింది. భర్త ఉండగానే ఇద్దరు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా... వారి సహాయంతో అడ్డుగా ఉన్నాడని భర్తను చంపేసింది. ఈ సంఘటన నిర్మల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా అంకాపూర్ కు చెందిన గుజ్జెట్టి ఉదయ్ కుమార్(39) మొదటి భార్య చనిపోవడంతో ఆలూరుకి చెందిన పావని అలియాస్ లావణ్యను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ రెండో పెళ్లే.... అతని కొంప ముంచింది. పావని కి కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. పావని, ఉదయ్ కుమార్ లు అంకాపూర్ లో నివాసం ఉంటున్నారు. కాగా... ఉదయ్ కుమార్ కూలీ పనులు చేస్తుండగా... పావని బీడీలు చుట్టేది.

Latest Videos

కాగా.... పావని భర్తతో ఉంటూనే తన పాత పరిచయస్తుడు దవాతే దౌలాజీ అలియాస్‌ రమేష్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. దౌలాజీ సైతం అంకాపూర్‌లోనే కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ సమయంలోనే తన భర్త ఉదయ్‌కుమార్‌ స్నేహితుడైన గంగాధర్‌తోనూ పావనికి పరిచయం ఏర్పడింది. ఆయనతోనూ వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భర్త ఉదయ్‌కుమార్‌కు ఇది తెలియడంతో పావనిని మందలించాడు. దీంతె ఇద్దరు ప్రియులతో కలసి భర్తను అంతం చేయాలని పథకం రచించింది.

4 నెలల క్రితం జూన్‌ 5న ఉదయ్‌ హత్యకు ప్లాన్‌ చేశారు. భర్తను చంపాలని ప్రియులిద్దరినీ పురమాయించింది. ఈ మేరకు వారిద్దరూ ఉదయ్‌కుమార్‌కు జరిగిందేదో జరిగింది. అన్నట్లుగా మాటలు చెప్పి, దావత్‌ చేసుకుందామని ఒప్పించారు. అదేరోజు అంకాపూర్‌ నుంచి బైక్‌పై నిర్మల్‌–నిజామాబాద్‌ జిల్లాల సరి హద్దులో గోదావరి ఒడ్డున గల నిర్మల్‌ జిల్లా మామడ మండలం పొన్కల్‌ గ్రామ శివారుకు తీసుకొచ్చారు. దౌలాజీ, గంగాధర్‌ తక్కువ మద్యం సేవించారు.

మద్యం మత్తులో ఉన్న అతనిని పావని ఇద్దరు ప్రియులు ఉదయ్ ని గోదావరిలో ముంచి చంపేశారు. నాలుగురోజుల తర్వాత జూన్‌ 9న ఉదయ్‌కుమార్‌ మృతదేహం బయటపడింది. స్థానికులు మామడ పోలీసులకు సమాచారం ఇవ్వగా, గుర్తుతెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు.

అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.... దర్యాప్తులో ఉదయ్ కుమార్ దే ఆ మృతదేహం అని గుర్తించారు. భార్య పావని నే చంపించిందని  తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. 

click me!