కాంగ్రెస్‌ నేతల హౌస్ అరెస్ట్, రేవంత్ రెడ్డి సహా కీలక నేతల కోసం పోలీసుల గాలింపు

By narsimha lodeFirst Published Oct 21, 2019, 10:27 AM IST
Highlights

ఆర్టీీసీ సమ్మెకు మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు కాంగ్రెస్ పిలుపునివ్వడంతో ముందస్తుగానే కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి సహా పలువురు నేతల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

హైదరాబాద్:  ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసం  ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నేతలు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

ఆర్టీసీ కార్మికుల  సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ప్రగతి భవన్ ను ముట్టడించాలని పిలుపునిచ్చింది.  ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో హైద్రాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.

హైద్రాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలను ముందస్తుగానే  హౌస్ అరెస్ట్  చేశారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.. రేవంత్ రెడ్డి అనుచరులు ఇళ్లలో కూడ పోలీసులు సోదాలు నిర్వహించారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ ఉన్నాడో పోలీసులకు ఆచూకీ దొరకలేదు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిల కోసం పోలీసులుగ ాలింపులు చర్యలు చేపట్టారు. వీరంతా కూడ తమ ఇళ్లలో లేరు. కాంగ్రెస్ కీలక నేతలు ఎక్కడ ఉన్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మధిర ఎమ్మెల్యే మల్లుభట్టివిక్రమార్కను పోలీసులు అరెస్ట్ చేశారు

మాజీ  ఎమ్మెల్యే సంపత్ కుమార్ ను పోలీసులు ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేశారు. ప్రగతి భవన్ కు సమీపంలోని హోటల్స్ లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైద్రాబాద్ తో పాటు జిల్లాల్లో కూడ కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. అయితే ప్రగతి భవన్ వద్దకు కాంగ్రెస్ నేతలు బృందాలుగా విడిపోయి వస్తున్నారు. ప్రగతి భవన్ వద్ద కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, పెద్దపల్లి తదితర జిల్లాల్లో కూడ కాంగ్రెస్ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి రాత్రి నుండి ఇంట్లో లేడు. కాంగ్రెస్ కీలక నేతలు ఎక్కడ ఉన్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

కాంగ్రెస్ నేతలు  ఏ క్షణంలోనైనా ప్రగతి భవన్ ను ముట్టడించే అవకాశం ఉందని భావించిన పోలీసులు ప్రగతి భవన్ వద్ద భారీగా మోహరించారు. ఈ ప్రాంతంలో ప్రతి వాహనాన్ని పోలీసులు తనిఖీ చేస్తున్నారు. ప్రగతి భవన్ వద్దకు వచ్చే కాంగ్రెస్ శ్రేణులను ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. 

ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5 వతేదీ నుండి సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెకు మద్దతుగానే కాంగ్రెస్ పార్టీ సోమవారం నాడు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ప్రగతి భవన్ ముట్టడించేందుకు రావడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. 

 

 

 

click me!