ప్రగతి భవన్ ముట్టడి.. బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేత

By telugu teamFirst Published Oct 21, 2019, 9:54 AM IST
Highlights

కాగా ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు.

బేగంపేట మెట్రో స్టేషన్ ని మెట్రో అధికారులు మూసివేశారు. మెట్రో స్టేషన్ కి తాళం వేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు మద్దుతుగా కాంగ్రెస్ నేతలు సోమవారం చలో ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 

కాగా... ఈ నిరసనలో భాగంగా ఆందోళనకారులు మెట్రో స్టేషన్ లోకి దూసుకువచ్చే అవకాశం ఉందని మెట్రో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా బేగంపేట మెట్రో స్టేషన్ ని మూసివేశారు.  కాగా భద్రతా కారణాల రీత్యా బేగంపేట మెట్రో స్టేషన్‌లో రైలు ఆగదంటూ మెట్రో అధికారులు ముందుగానే ప్రతి మెట్రో స్టేషన్‌లో నోటీసు అంటించారు. 

కాగా ఆర్టీసీ సమ్మె పరిష్కరించనందుకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్‌ ముట్టడి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు టీపీసీసీ కార్యాలయం గాంధీభవన్‌ నుంచి ర్యాలీగా ఆ పార్టీ నేతలు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముందస్తుగా కాంగ్రెస​ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మరోవైపు ఎంపీ రేవంత్‌రెడ్డితో పాటు షబ్బీర్‌ అలీతో పాటు పలువరు నేతలను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

అయితే... ఇప్పటికే బస్సులు నడవక ఇబ్బంది పడుతుంటే... తాజాగా మెట్రో స్టేషన్ ని కూడా మూసివేయడం పట్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురౌతున్నారు. ఆ ప్రాంతంలోని ప్రయాణికులు మెట్రో స్టేషన్ ని మూసివేయడం పట్ల తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. బస్సులు లేకపోవడంతో మెట్రోకి వెళ్తుంటే... అవి కూడా మూసివేయం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.  

ఇదిలా ఉండగా... తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటికి 17వ రోజుకి చేరుకుంది.  ఈ సమ్మెలో భాగంగా శనివారం బంద్ కూడా చేపట్టారు. ఈ బంద్ కి క్యాబ్ సర్వీసులు కూడా మద్దతు తెలిపాయి. ఆ రోజు ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులతో నడుపుతున్న పలు బస్సులను కూడా ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. 

click me!