RTC Strike: రంగంలోకి అమిత్ షా... ఢిల్లీకి లక్ష్మణ్

By telugu teamFirst Published Nov 2, 2019, 11:03 AM IST
Highlights

ఆర్టీసీ సమ్మె కీలక మలుపు తిరగబోతోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేరుగా రంగంలోకి దిగారు. బిజెపి తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ అమిత్ షా పిలుపుతో ఢిల్లీ వెళ్తున్నారు.

హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెపై కేంద్రం సీరియస్ అయ్యింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన హస్తినకు పయనమవనున్నారు. ఢిల్లీ వెళ్ళగానే అమిత్ షా ను లక్ష్మణ్ కలుస్తారు. ఆ తరువాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ను కూడా కలవనున్నారు. 

పయనమయ్యే ముందు ఆర్టీసీ నేతలు అశ్వద్ధామ రెడ్డి  సహా మరికొంత మందిని కలిశారు. వారందించిన నివేదికను తీసుకొని లక్ష్మణ్ ఢిల్లీ బయల్దేరనున్నట్టు తెలుస్తోంది. నిన్నటి బండి  సంజయ్ ఉదంతం కూడా తోడవడంతో రాజకీయంగా చాల ప్రాధాన్యతను ఈ మీటింగ్ సంతరించుకుంది. 

Also read: RTC Strike: తెలంగాణ ఆర్టీసీలో కర్ణాటక మోడల్?

లక్ష్మణ్ తో భేటీ ముగియగానే కేంద్రం దృష్టికి ఆర్టీసీ సమస్యను తీసుకెళ్లామని కోరినట్టు అశ్వద్ధామ రెడ్డి ఒక ప్రకటన చేసారు. దీన్నిబట్టి కేంద్రం ఈ విషయంలో స్పందించబోతుందనేది స్పష్టమవుతుంది. 

నిన్న కరీంనగర్ లో బండి సంజయ్ పై దురుసుగా పోలీసులు ప్రవర్తించడంపై కూడా బీజేపీ ఉన్నత వర్గాలు ఆరా తీస్తున్నాయి. నిన్న ధర్మపురి అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి మరి కిషన్ రెడ్డి ని న్యాయం జరిగేలా చూడమని డిమాండ్ చేసారు. 

మరో అంశమేమిటంటే లక్ష్మణ్ అశ్వద్ధామ రెడ్డిని కలిసేటప్పుడు పక్కన కోదండరాం కూడా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఎం చేయాలనేదానిపై లక్ష్మణ్ వీరిరువురి నుంచి సలహాలు స్వీకరించినట్టు తెలుస్తోంది. ఈ నివేదికలో కార్మికులు ఎందరు చనిపోయారు, జీతాలివ్వకుండా తమను ఎలా కెసిఆర్ ఇబ్బందులకు గురి చేస్తున్నారో సవివరంగా వివరించారట. 

అంతే కాకుండా అడ్డగోలుగా ప్రైవేట్ వాహనాలను నడపడం వల్ల తెలంగాణాలో జరుగుతున్న ప్రమాదాలపై కూడా వీరు నివేదించినట్టు సమాచారం. హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి నిన్నటి బండి సంజయ్ ఉదంతం పై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి నివేదికలు తెప్పించుకోనున్నట్టు సమాచారం. 

Also read: డ్రైవర్ బాబు అంతిమయాత్ర: బీజేపీ ఎంపీ సంజయ్‌పై చేయిచేసుకున్న ఏసీపీ, ఉద్రిక్తత

ఢిల్లీకి చేరుకోగానే లక్ష్మణ్ అమిత్ షా ను కలవనున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంపై కూడా లక్ష్మణ్ అమిత్ షా కు వివరించనున్నట్టు సమాచారం. 

నిన్న ఆర్టీసీ కార్మికుడు బాబు అంతిమయాత్రపై కూడా పోలీసుల నిర్బంధం ఏంటని విపక్షనేతలు మండిపడ్డారు. ప్రభుత్వం అడుగడుగునా కార్మికులను అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

బాబు అంతిమయాత్రకు పోలీసులు అనుమతించకపోవడమే ఉద్రిక్తతకు కారణం.. బాబు మృతదేహాన్ని దారి మళ్లించి వేరే చోటుకి తరలించారు. పెద్దఎత్తున ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబసభ్యులు తరలిరావడంతో ఆరేపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 

Also Read:ఇన్‌ఛార్జ్ ఎండీని కోర్టు ముందు దోషిగా నిలబెట్టాం..అది మా స్టామినా : అశ్వత్థామరెడ్డి

ఓ పోలీస్ అధికారి  కరీంనగర్  ఎంపీ బండి సంజయ్ పై  చేయి చేసుకోవడాన్ని  నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి  తీవ్రంగా ఖండించారు. ఇది తెలంగాణ ప్రభుత్వ దమన నీతికి, దుర్మార్గానికి పరాకాష్ఠ అన్నారు. వెంటనే  డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించి  కరీంనగర్ పోలీస్ కమిషనర్, ఏసీపీ లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు .

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి  ఆ అధికారులను వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నిన్నటి వరకు బీజేపీ కార్యకర్తలు , నాయకుల మీద కక్ష సాధింపు చర్యలుగా తప్పుడు కేసులు బనాయించి  వేధించిన పోలీసులు ఏకంగా కేసీఆర్ మెప్పు కోసం, కేసీఆర్ ఆదేశాల మేరకు బీజేపీ నాయకుల మీద తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారని అర్వింద్ ఆరోపించారు.

click me!