ప్రైవేటు బస్సు ఢీకొని మహిళ మృతి

Published : Nov 02, 2019, 10:37 AM IST
ప్రైవేటు బస్సు ఢీకొని మహిళ మృతి

సారాంశం

స్కూటీ మీద వెళ్తున్న యువతిని ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. యువతి సైదాబాద్ కి చెందిన కావ్యగా పోలీసులు గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ప్రైవేటు బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన సంఘటన హైదారబాద్ నగరంలో చోటుచేసుకుంది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధి నల్గొండ క్రాస్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

స్కూటీ మీద వెళ్తున్న యువతిని ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. యువతి సైదాబాద్ కి చెందిన కావ్యగా పోలీసులు గుర్తించారు.  సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం  బస్సును , డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

యువతి  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. మహిళకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె వివరాలు తెలుసుకొని... కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తామని పోలీసులు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !