21వ రోజుకు ఆర్టీసీ సమ్మె: ఆగిన మరో కార్మికుడి గుండె

By Nagaraju penumalaFirst Published Oct 25, 2019, 11:35 AM IST
Highlights

నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన జమీల్‌కు గురువారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యాడు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెలో జమీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే అర్థరాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నల్గొండలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. 
 

హైదరాబాద్ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 21వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులతో చర్చలకు వెళ్లేది లేదని సీఎం కేసీఆర్ గురువారం సైతం తేల్చి చెప్పడం, అటు ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తేనే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ యూనియన్ నేతలు భీష్మించుకు కూర్చున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడగా పలువురు గుండెపోటుతో మృతతి చెందారు. ఇకపోతే తాజాగా మరో ఆర్టీసీ కార్మికుడు గుండెపోటుతో చనిపోయాడు. 

నార్కట్‌పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన జమీల్‌కు గురువారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యాడు. ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెలో జమీల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే అర్థరాత్రి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నల్గొండలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు. 

తెలంగాణ ప్రభుత్వ మొండి వైఖరి వల్లే మానసిక ఒత్తిడికి లోనై డ్రైవర్ జమీల్ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారని అందువల్లే చనిపోయారంటూ బోరున విలపించారు.  

ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ఈడీల కమిటీ నివేదిక రెడీ
ఇదిలా ఉంటే ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం నియమించిన ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ సాధ్య అసాధ్యాలపై చర్చిస్తోంది. ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 26 డిమాండ్లపై కమిటీ నివేదికను తయారు చేసింది.  

ఆర్టీసీ కార్మికులు కోరుతున్న 21 డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై రెండు నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ మినహా ఇతర డిమాండ్లపై నివేదిక తయారు చేసినట్లు సమాచారం. 

ఇప్పటి వరకు రూపొందించిన నివేదికలలో అన్నింటిని మళ్లీ పరిశీలించి సమగ్ర వివరాలతో కూడిన ఫైనల్ నివేదికను కోర్టుకు అందించనుంది ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ. హైకోర్టు అడిగిన ప్రతి అంశానికి సంబంధించి రెండు రకాల సమాధానాలను అధికారులు సిద్ధం చేశారు. 

అలాగే ఆర్టీసీకి అద్దె బస్సుల అవసరంపై కూడా అధికారులు ప్రత్యేక నివేదికను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నివేదికను సీఎం కేసీఆర్‌కు ఈడీల కమిటీ సమర్పించనుంది. అనంతరం ఈనెల 28న హైకోర్టు విచారణలో అందించనుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

RTC strike: ఆర్టీసీ ఖతమ్: ఆర్టీసీ సమ్మెపై తేల్చేసిన కేసీఆర్

హైకోర్టు ఏమైనా కొడతదా..? : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఆర్టీసీ నీ జాగీరు కాదు, ఎవరికి ముగింపో ప్రజలే నిర్ణయిస్తారు: కేసీఆర్ కు అశ్వత్థామరెడ్డి వార్నింగ్
 

click me!