త్వరలో ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్: అశ్వత్థామరెడ్డి పిలుపు

By Nagaraju penumalaFirst Published Oct 30, 2019, 6:23 PM IST
Highlights

గురువారం మధ్యాహ్నాం 2గంటల నుంచి 24 గంటల దీక్షకు పిలుపునిచ్చారు అశ్వత్థామరెడ్డి. ప్రతీ ఉద్యోగి ఒక్కరోజు దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని పోరాడి సాధించుకుందామని చెప్పుకొచ్చారు.

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ తరహా ఉద్యమానికి సిద్ధం కావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యమానికి ప్రభుత్వం దిగిరాకపోతే త్వరలోనే ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చ్ కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 

గురువారం మధ్యాహ్నాం 2గంటల నుంచి 24 గంటల దీక్షకు పిలుపునిచ్చారు అశ్వత్థామరెడ్డి. ప్రతీ ఉద్యోగి ఒక్కరోజు దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరూ అధైర్యపడొద్దని పోరాడి సాధించుకుందామని చెప్పుకొచ్చారు. 

సమ్మె అనేది ఇల్లీగల్ కాదు అని హైకోర్టు చీఫ్ జస్టిస్ అన్నారని చెప్పుకొచ్చారు అశ్వత్థామరెడ్డి. సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ కార్మికుల మధ్య చిచ్చు పెట్టేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తాదని వాటికి అవకాశం ఇవ్వొద్దని సూచించారు. 

ఆర్టీసీవిలీనమే ప్రధాన అజెండాగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సకల జనుల సమరభేరి సభలో మాట్లాడిన ఆయన కార్మికులు అధైర్యపడొద్దని తెలిపారు. 25 రోజులుగా ఆందోళన చేస్తున్నామని మరింత ఉధృంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

దేశచరిత్రలో ఆర్టీసీ ఇలాంటి బహిరంగ సభలను నిర్వహించడం ఇదే ప్రథమం కావొచ్చన్నారు అశ్వత్థామరెడ్డి. కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

ఆర్టీసీ కార్మికులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని కానీ కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోకూడదని ప్రయత్నిస్తుందన్నారు. ఆర్టీసీ కార్మికులు గెలుపుకోసం ప్రయత్నిస్తున్నారని చివరికి గెలుపు కార్మికులదేనన్నారు. 

సమ్మె వల్ల ప్రభుత్వం నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా గమ్యాన్ని చేరాల్సిందేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం కులమతాలకు అతీతంగా అందరూ ఉద్యమం చేశారని తాము కూడా పాల్గొన్నామని తెలిపారు. 

రామాయణంలో ఉడత రామునికి దారి చూపించకుంటే రామాయణమే లేదన్నారు. తాము ఉడలాంటి వాళ్లమన్నారు. సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను బెదిరించారని చెప్పుకొచ్చారు. భయపెట్టారు అని కూడా తెలిపారు. జీతాలు ఇవ్వకున్నా ఏ ఒక్క కార్మికుడు వెనక్కి తగ్గలేదన్నారు. 

ఆర్టీసీ పరిరక్షణ తమ లక్ష్యమని ఆర్టీసీ జేఏసీ కోన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజాపరిరక్షణ తమ అభిమతమన్నారు. యూనియన్లు మూసేస్తామంటున్న కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే తాము యూనియన్లను మూసేస్తామని అప్పుడు సీఎం కేసీఆర్ కల కూడా నెరవేరుతుందని రాజిరెడ్డి ఎద్దేవా చేశారు.   

ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గురువారానికి 27 రోజుకు చేరుకుంటుందన్నారు. సకల జనుల సమ్మె కూడా ఆనాడు 27 రోజులే జరిగిందని అలాంటి ఉద్యమం ఆర్టీసీ కార్మికులు చేశారని తెలిపారు. సకల జనుల సమ్మె కంటే పోరాట పటిమతో ఆర్టీసీ కార్మికులు పోరాటం చేస్తున్నారని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. 

ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా దీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు గురువారం దీక్ష విరమించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

RTC Strike:జగన్‌ను లాగి ఆర్టీసీ విలీనంపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
 

click me!