హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణం

By narsimha lodeFirst Published Oct 30, 2019, 5:33 PM IST
Highlights

హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి బుధవారం నాడు ప్రమాణం చేశారు.  హైద్రాబాద్‌ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో సైదిరెడ్డితో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు.

హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా శానంపూడి సైదిరెడ్డి బుధవారం నాడు ప్రమాణం చేశారు.  హైద్రాబాద్‌ అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో సైదిరెడ్డితో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రమాణం చేయించారు.

హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ,మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డిలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కంటే ముందుగా తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద సైదిరెడ్డితో పాటు మంత్రులు నివాళులర్పించారు. అక్కడి నేరుగా అసెంబ్లీలోకి వెళ్లారు. 

ఈ నెల 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతిపై ఘన విజయం సాధించారు. 2009 నుండి ఈ స్థానం నుండి హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానం నుండి  కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. 

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో నల్గొండ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ కుమార్ రె్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీమామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య పద్మావతిని బరిలోకి దింపారు. ఈ ఎన్నికల్లో పద్మావతి ఘోర పరాజయం పాలయ్యారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్తానంలో  టీఆర్ఎస్‌ అభ్యర్ధి సైదిరెడ్డికి 1,12,796 ఓట్లు వచ్చాయి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డికి   69,563 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్ధి కోట రామారావు, టీడీపీ  అభ్యర్ధి చావా కిరణ్మయికి 1827 ఓట్లు వచ్చాయి.ఇక కాంగ్రెస్ పార్టీ తర్వాత మూడో స్థానంలో సుమన్ అనే ఇండిపెండెంట్ అభ్యర్థికి 2693 ఓట్లు వచ్చాయి. సుమన్ కంటే టీడీపీ, బీజేపీ అభ్యర్ధులకు తక్కువ ఓట్లు వచ్చాయి. 

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో  మొదటి రౌండ్ నుండి టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి ఆధిక్యతను కనబరుస్తున్నాడు. తొలి రౌండ్‌ నుండి సైదిరెడ్డి ఆధిక్యత పెరుగుతూనే వచ్చింది. టీఆర్ఎస్ ఆధిక్యాన్ని ఏ రౌండ్‌లో కూడ కాంగ్రెస్ అడ్డుకోలేకపోయింది.

గురువారం నాడు సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీలో ఓట్లను లెక్కించారు.సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 

మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించేందుకు గాను 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ పది నిమిషాలకు ఒక్క రౌండ్ ఫలితం వచ్చింది. ఈ నియోజకవర్గంలో మొత్తం పోలైన ఓట్లు 2 లక్షల 751. మండలానికి 5 పోలింగ్ కేంద్రాల చొప్పున వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు చేపట్టారు.

read more  Huzurnagar Election Result: 20 ఏళ్ల ఉత్తమ్ కోట బద్దలు, ఒక్కసారి చూద్దామని సైదిరెడ్డికి...

ఇక హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ  అభ్యర్ధులకు డిపాజిట్లు కూడ దక్కలేదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధికి 1515 ఓట్లు వచ్చాయి.ఈ ఎన్నికల్లో నోటా కంటే బీజేపీ అభ్యర్ధి 1515 ఓట్లు వచ్చాయి. 

read more  #Huzurnagar result: రికార్డు బద్దలు కొట్టిన సైదిరెడ్డి

ఈ దఫా బీజేపీ అభ్యర్ధి కోట రామారావుకు గతంలో కంటె ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 2621 ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్ధి చావా కిరణ్మయికి 1827 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో 25,395 ఓట్లు టీడీపీ అభ్యర్ధి వంగాల స్వామిగౌడ్ కు వచ్చాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ  ఈ స్థానంలో పోటీ చేయలేదు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించింది.    

 
 

click me!