ఆర్టీసీ సమ్మె: కోర్టుకు వెళ్లే యోచనలో కాంగ్రెస్

By narsimha lodeFirst Published Nov 27, 2019, 3:02 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మె విషయమై కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విన్న వించారు. 


హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమస్మలపై కోర్టుకు వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్ ఆర్టీసీ కార్మికులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకొంటే కోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ నేతలు  ఓ నిర్ణయానికి వచ్చారు. అంతేకాదు ఈ విషయమై కేంద్రాన్ని కూడ కలవాలనే అభిప్రాయంతో ఉన్నారు.

Also read:ఆర్టీసీ సమ్మె: హక్కులను కాలరాయడమేనా....

 కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎ. రేవంత్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు మంగళవారం నాడు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. తెలంగాణలో ఆర్టీసీని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని  కోరారు..ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గుర్తు చేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమిస్తామని ప్రకటించిన తర్వాత కూడ ప్రభుత్వం నుండి సానుకూలమైన స్పందన రాలేదు.. లేబర్ కోర్టు తీర్పు వచ్చిన తర్వాతే నిర్ణయం  తీసుకొంటామని ఆర్టీసీ ఇంచార్జీ ఎండీ సునీల్ శర్మ తేల్చి చెప్పారు.

విధుల్లో చేరేందుకు ఆర్టీసీ కార్మికులు ప్రతి రోజూ డిపోల వద్దకు వెళ్తున్నారు. కానీ, కార్మికులను మాత్రం యాజమాన్యం విధుల్లోకి తీసుకోలేదు. మరో వైపు ఆర్టీసీ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించనున్నారు.

తమ డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి సమ్మె చేస్తున్నారు. సమ్మెలో పాల్గొంటున్న కార్మికులను విదుల్లో చేరాలని తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు దఫాలు కోరాడు. అయితే కార్మికులు మాత్రం విధుల్లో చేరలేదు. సమ్మెను కొనసాగించారు.

  

click me!