
టీఎస్ ఆర్టీసీ కార్మికులు రెండు గంటల పాటు చేపట్టిన నిరసన ముగిసింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిరసన కొనసాగింది. సంస్థలో పని చేసే కార్మికులు, సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఇంకా ఆమోద ముద్ర వేయలేదు. దీనిని నిరసిస్తూ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు తెలంగాణ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్ నుంచి సానియా వివరాలు తొలగించిన షోయబ్ మాలిక్.. మళ్లీ మొదలైన విడాకుల ఊహాగానాలు..
రాజధానిలోని ఫలక్‌నుమా డిపోతో పాటు ఫరూక్ నగర్, ఉప్పల్, చెంగిచెర్ల, హయత్‌నగర్ డిపోలు, అలాగే మరికొన్ని చోట్ల కార్మికులు నిరసన చేపట్టారు. నిరసన ముగిసిన తరువాత బస్సులు ఎప్పటిలాగే సర్వీసులు ప్రారంభించాయి. కాగా.. ఈ ఆకస్మిక నిరసనతో హైదరాబాద్ లో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు కొంత ఇబ్బందులు పడ్డారు.
ఉగ్రవాదులతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్ల మృతి.. కాశ్మీర్ లోని కుల్గాంలో ఘటన..
ఇదిలా ఉండగా నేటి ఉదయం 11.00 గంటలకు మళ్లీ తెలంగాణ రాజ్ భవన్ వద్ద నిరసన చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న కార్మికులు 10 గంటలకు నెక్లెస్ రోడ్డుకు రావాలని కోరింది. ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గం ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది.
ఆర్టీసీ విలీనం రగడ:బిల్లుపై తమిళిసై కోరిన వివరణలు ఇవే
అయితే దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంది. అది ఆర్థిక బిల్లు కావడంతో గవర్నర్ ఆమోద ముద్ర వేయాల్సి ఉంది. దీని కోసం ప్రభుత్వం రెండు రోజుల కిందట గవర్నర్ కు అవసరమైన ఫైల్స్ ను పంపించింది. కానీ ఇప్పటి వరకు దానికి అనుమతి లభించలేదు. దీంతో కార్మికులు నిరసన చేపడుతున్నారు.